Header Banner

ఒక్కరోజులో రేటు మారింది… బంగారం వెండి మార్కెట్‌లో ఊహించని ట్విస్ట్‌!

సాక్షి డిజిటల్ న్యూస్:బంగారం, వెండి ధరల్లో సోమవారం కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఊహించని విధంగా గోల్డ్ రేటు పెరిగింది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలో భారీగా పెరుగుదల నమోదైనట్లు తెలుస్తోంది.సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 1,200 పెరగ్గా.. 24క్యారట్ల బంగారంపై రూ. 1100 పెరిగింది. అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఇవాళ ఒక్కరోజే ఔన్సు గోల్డ్ పై 71డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ ధర 4,072 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ధరసైతం భారీగానే పెరిగింది. కిలో వెండిపై రూ.2వేలు పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,12,950 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,23,220కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,13,100 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,23,370కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,12,950 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,23,220కు చేరింది.

వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,67,900 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,55,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,67,900 వద్దకు చేరింది.