స్కూల్ బస్ డ్రైవర్ చివరి సాహసం.. 50 మంది చిన్నారులను కాపాడిన తర్వాత మరణం

సాక్షి డిజిటల్ న్యూస్ :ఎప్పటిలానే ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులతో బస్సు బయలుదేరింది. దారి మధ్యలో ఉండగా.. డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది.. ఈ క్రమంలోనే.. చాకచక్యంగా వ్యవహరించాడు డ్రైవర్.. వెంటనే బస్సును ఆపి డివైడర్‌ దగ్గర డ్రైవర్‌ కుప్పకూలాడు.. డ్రైవర్‌ గురించి సేఫ్టీ హైవే పెట్రోలింగ్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు.. హుటాహుటిన వచ్చి.. ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే.. డ్రైవర్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.. ఈ విషాద ఘటన.. కోనసీమ జిల్లా కొత్తపేటలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.50 మంది విద్యార్థులను స్కూల్ బస్ డ్రైవర్ కాపాడి తనువు చాలించాడు.. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన దెందుకూరి నారాయణరాజు (60) రాజమండ్రి గైట్ ఇంజనీరింగ్ కళాశాల బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.. దినచర్యలో భాగంగా సోమవారం ఉదయం విద్యార్థులను గైట్ ఇంజనీరింగ్ కళాశాలకు బస్సులో తరలిస్తుండగా మడికి 216ఏ జాతీయ రహదారిపై వెళుతూ డ్రైవర్ అస్వస్థకు గురయ్యాడు. నారాయణ రాజుకు గుండెపోటు రావడంతో బస్సును మధ్యలోనే క్షణాల్లో బస్సు ఆపి క్రిందకు దిగి జాతీయ రహదారి డివైడర్ లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.. విద్యార్థులు గమనించి సేఫ్టీ హైవే పెట్రోలింగ్ సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు క్షణాల్లో చేరుకుని ఆసుపత్రికి తరలించే తరుణంలో బస్సు డ్రైవర్ ప్రాణాలను కోల్పోయాడు.. డ్రైవర్ నారాయణరాజు తను చనిపోతూ 50 మంది విద్యార్థులను కాపాడడంతో మంచి డ్రైవర్ని కోల్పోయామంటూ.. కాలేజీ యాజమాన్యం, స్థానికులు పేర్కొన్నారు. విద్యార్థులతో గౌరవంగా ఉన్న నారాయణరాజు వారి కళ్ళ ఎదుటే చనిపోవడం విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు.. తమను రక్షించి డ్రైవర్ ప్రాణాలు విడవడంతో విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *