Header Banner

ఓటరు జాబితాలో పేరు లేక కోపంతో తినడం మానేసిన వృద్ధుడు.. చివరికి దారుణం!

సాక్షి డిజిటల్ న్యూస్ :2002 ఓటరు జాబితాలో శ్యామల్ పేరు లేదని తెలుసుకున్న తర్వాత అతను తినడం, తాగడం మానేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అతని వద్ద అన్ని చెల్లుబాటు అయ్యే పత్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. మరణం గురించి మాకు సమాచారం అందింది, కానీ కుటుంబం నుండి ఎటువంటి అధికారిక ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అయినా విచారణ చేపట్టామన్నారు.పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో సోమవారం (నవంబర్ 10) ఉదయం 70 ఏళ్ల వ్యక్తి మరణించాడు. పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పట్ల ఆందోళన కారణంగా అతను మరణించాడని అతని కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడిని తాహిర్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని కృష్ణచక్‌పూర్ మండల్‌పారా నివాసి శ్యామల్ కుమార్ సాహాగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.2002 ఓటరు జాబితాలో శ్యామల్ పేరు లేదని తెలుసుకున్న తర్వాత అతను తినడం, తాగడం మానేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అతని వద్ద అన్ని చెల్లుబాటు అయ్యే పత్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. మరణం గురించి మాకు సమాచారం అందింది, కానీ కుటుంబం నుండి ఎటువంటి అధికారిక ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అయినా విచారణ చేపట్టామన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శ్యామల్ ఒక హాకర్. ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆస్తి పత్రాలు వంటి అన్ని చెల్లుబాటు అయ్యే పత్రాలు ఉన్నప్పటికీ, ఓటరు జాబితా SIR ప్రకటించినప్పటి నుండి శ్యామల్ భయపడుతున్నాడని దర్యాప్తులో వెల్లడైంది. “అతను తిండి తిప్పలు మానేసి, నిరంతరం ఆందోళన చెందాడు” అని అతని భార్య చెప్పింది. స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, పంచాయతీ సభ్యులు శ్యామల్ కుటుంబాన్ని పరామర్శించారు. కాగా, 23 సంవత్సరాల విరామం తర్వాత పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ జరుగుతోంది. కు గురవుతోంది. రాష్ట్రంలో చివరి SIR 2002లో నిర్వహించారు.ఓటరు జాబితా సవరణ ప్రకటించినప్పటి నుండి, పశ్చిమ బెంగాల్‌లో చాలా మంది భయాందోళనలకు గురవుతున్నారు. ఓటర్ల జాబితా నుండి తమ పేర్లు ఎక్కడ తొలగిస్తారోననే భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ఎన్నికల కమిషన్ ప్రారంభించిన SIR ప్రక్రియ వల్ల కలిగే భయాందోళన చాలా మందిని ఇబ్బందుల్లో పడేసిందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ ఈ ఆరోపణను తిరస్కరించింది. దీనిని రాజకీయంగా ప్రేరేపితమని పేర్కొంది.