సాక్షి డిజిటల్ న్యూస్ :సీఎం అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఏపీ మంత్రివర్గసమావేశం ముగిసింది. ఈ భేటీలో కీలక అంశాలు చర్చించారు. 65పైగా ఎజెండాతో జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గం 65 అంశాలకు ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీలో ముఖ్యంగా విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ సమ్మిట్ గురించి ప్రధానం చర్చ జరిగినట్లు సమాచారం. ఇందులో క్వాంటం పాలసీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. మొంథా తుఫాన్ సమయంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలపై సీఎం చంద్రబాబు మంత్రులు ఈ సమావేశంలో అభినందించారు. అలాగే పార్టీ కార్యాలయాల లీజ్ కు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాగా కేబినెట్ భేటీ దాదాపు 3గంటలకు పైగా సాగింది.