అందెశ్రీ మృతి పట్ల జడ్చర్ల బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడు అభిమన్యు రెడ్డి ఘన నివాళి
సాక్షి డిజిటల్ న్యూస్ రీపోటర్ రామని గణేష్ ఇదిగానిపల్లి
జడ్చర్ల నియోజకవర్గం బిఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడు అభిమన్యు రెడ్డి సాక్షి డిజిటల్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఆత్మను పదాలలో ప్రతిబింబించిన కవి అందెశ్రీ సాహిత్యం తరతరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.తెలంగాణ ఉద్యమానికి, రాష్ట్ర భావజాలానికి అందెశ్రీ కవిత్వం అస్త్రంగా మారిందనీ జడ్చర్ల టిఆర్ఎస్ పార్టీ చించేడు అభిమానులు రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తుచేశారు.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని, అందెశ్రీతో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో ఉన్న అనుబంధాన్ని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ గొప్పది అని తెలిపారు.తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ
స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. అందెశ్రీ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి జడ్చర్ల టిఆర్ఎస్ పార్టీ చించేడు అభిమానులు రెడ్డి తెలిపారు