భూటాన్ పర్యటన ముగింపు – ఇండియా-భూటాన్ సంబంధాలకు కొత్త దిశ

సాక్షి డిజిటల్ న్యూస్ :భూటాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల అధికారిక పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. భూటాన్ మాజీ రాజు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా పాల్గొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భూటాన్‌కు చేరుకున్న పీఎం మోదీ.. థింఫూలోని తషిచోడ్జోంగ్ ప్యాలెస్‌కు చేరుకున్నారు. అక్కడ భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యేల్ వాంగ్‌చుక్‌తో సమావేశం నిర్వహించారు. అయితే ఈ వాంగ్‌చుక్.. భూటాన్‌కు నాల్గో డ్రక్ గ్యాల్పో. ప్రస్తుత భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యేల్ వాంగ్‌చుక్ తండ్రి అంతకుముందు, పీఎం మోదీకి సాంప్రదాయ ‘చిప్‌డ్రైల్’ ఊరేగింపుతో స్వాగతం పలికారు. రాయల్ బాడీగార్డ్స్, రాయల్ భూటాన్ ఆర్మీ, రాయల్ భూటాన్ పోలీస్ తరపున ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ను అందజేశారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్‌లో పోస్టు చేశారు.  భూటాన్ రాజును కలుసుకోవడానికి పీఎం థింఫూలోని తషిచోడ్జోంగ్ ప్యాలెస్‌కు చేరుకున్నారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు భారత్, భూటాన్ పంచుకునే ప్రత్యేకమైన, విశిష్టమైన సంబంధాలకు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. పీఎం మోదీ.. భూటాన్ రాజు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించి వాటిని కొత్త స్థాయికి తీసుకెళ్లే మార్గాలపై చర్చించారు. భారత్-భూటాన్ సంబంధాలకు మరింత ఊపునిస్తున్నారు. పీఎం భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యేల్ వాంగ్‌చుక్‌తో చర్చలు జరిపారు. ప్రత్యేకమైన, విశిష్టమైన భారత్-భూటాన్ మైత్రిపై నిబద్ధతను పునరుద్ధరించుకుంటూ నాయకులు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ఈ కొత్త స్థాయికి తీసుకెళ్లే మార్గాలపై చర్చించారని జైస్వాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అదే విధంగా భూటాన్ రాజు హిమాలయ దేశపు అత్యున్నత గౌరవమైన ‘ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్పో’ను పీఎం మోదీకి ప్రదానం చేశారు.  ఈ మేరకు ఆయనకు పీఎం మోదీ ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ గౌరవాన్ని అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వ అధినేత కావడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *