Header Banner

బంగారం రేట్లు క్షీణతలో, వెండి రికార్డ్ స్థాయికి – పెట్టుబడిదారుల దృష్టి ఆకర్షణ

సాక్షి డిజిటల్ న్యూస్ :ప్రస్తుతం బంగారం ధర తగ్గింది. అదే వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. డాలర్ విలువ పెరిగే కొద్దీ బంగారం ధర తగ్గుతుంది. దీనికి ప్రధాన కారణం డాలర్ విలువ పెరిగే కొద్దీ అమెరికా ఫెడరల్ రిజర్వ..నిన్నటి నుంచి నిలకడగా ఉన్న బంగారం ధర.. బుధవారం 11 గంటల సమయానికి అప్‌డేట్‌ అయ్యింది. తాజాగా తులం బంగారంపై రూ.330 తగ్గుముఖం పట్టింది. అదే వెండి ధర మాత్రం రూ.2000 వరకు పెరిగింది. అంటే బంగారం ధర తగ్గితే.. వెండి ధర పెరిగింది.బుధవారం బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దేశీయ స్పాట్ మార్కెట్‌లో ధరలు రెడ్ మార్క్‌లో ట్రేడవుతున్నాయి. గుడ్ రిటర్న్స్ ప్రకారం, ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.310 తగ్గుదలతో రూ.1,25,660 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,15,200 వద్ద ఉంది.అదే సమయంలో 18 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.94,280 వద్ద ఉంది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు రెడ్ మార్క్‌లో ట్రేడవుతున్నాయి.ప్రారంభ ట్రేడ్‌లో MCX ఎక్స్ఛేంజ్‌లో బంగారం ఫ్యూచర్స్ ధర రూ.63 స్వల్ప తగ్గుదలతో 10 గ్రాములకు రూ.1,23,850 వద్ద ట్రేడవుతోంది.పెరిగిన వెండి ధర: బుధవారం బంగారం ధర తగ్గితే వెండి పెరిగింది. దేశీయంగా స్పాట్ ధరలు గ్రీన్‌లో ఉన్నాయి. ఢిల్లీలో వెండి స్పాట్ ధర కిలోకు రూ.2000 పెరిగి రూ.1,62,000కి చేరుకుంది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో వెండి కూడా గ్రీన్‌లో ట్రేడవుతోంది. MCXలో వెండి ఫ్యూచర్స్ ధర 0.50 శాతం లేదా రూ.772 పెరుగుదలతో కిలోకు రూ.1,55,459 వద్ద ట్రేడవుతోంది.