సాక్షి డిజిటల్ న్యూస్ :అంతర్జాతీయ విద్యార్థులకు కెనడా షాక్ ఇచ్చింది. 50 శాతం స్టడీ పర్మిట్స్ను తగ్గించేందుకు కొత్త ఇమిగ్రేషన్ ప్రక్రియను తీసుకురాబోతుంది. ఇక, రాబోయే మూడేళ్లలో అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంతో పాటు తాత్కాలిక నివాస హోదా కలిగిన వారి సంఖ్యను తగ్గించనున్నట్లు కెనడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ఏడాది 2025 బడ్జెట్, ఇమిగ్రేషన్ ఆలోచనలో భాగంగా.. తాజాగా ఈ ప్రకటన విడుదల చేసింది కెనడా ప్రభుత్వం. అంతర్జాతీయ విద్యార్థుల అడ్మిషన్లతో వస్తున్న ఆదాయంపై కెనడా యూనివర్సిటీలు, కాలేజీలు ఆధారపడ్డాయి. ఈ నూతన విధానంతో విద్యాసంస్థల నుంచి వచ్చే ఆదాయాలు పడిపోవటం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.