సాక్షి డిజిటల్ న్యూస్ :సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. వచ్చే సంవత్సరం మొదట్లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. సినిమా మొదలు కాకముందే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ పోలీసాఫీసర్ గా చేస్తున్నాడు అని చెప్పడంతో హైప్ మరింత పెరిగింది.అయితే ప్రభాస్ స్పిరిట్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఉన్నారని ఒక రూమర్ బాగా వైరల్ అయింది. తాజాగా సందీప్ రెడ్డి వంగ దీనిపై క్లారిటీ ఇచ్చారు. శివ రీ రిలీజ్ సందర్భంగా నాగార్జున – ఆర్జీవీ – సందీప్ రెడ్డి వంగ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాలో చిరంజీవి ఉన్నారా అనే దానిపై క్లారిటీ ఇచ్చారు.సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ.. చిరంజీవి గారు స్పిరిట్ సినిమాలో లేరు. అది జస్ట్ ఒక రూమర్ మాత్రమే. కానీ ఆయనతో నేను సోలో సినిమా చేస్తాను. దాని కోసం కథ తయారు చేస్తున్నాను అని తెలిపాడు. దీంతో ప్రభాస్ స్పిరిట్ సినిమాలో మెగాస్టార్ లేరని క్లారిటీ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి 70 ఏళ్ళ వయసులో కూడా యువ దర్శకులతో వరుస సినిమాలు చేస్తున్నారు. సందీప్ రెడ్డి మెగాస్టార్ కి కల్ట్ వీరాభిమాని అని అందరికి తెలిసిందే. మరి సందీప్ అయితే చిరుతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. చిరంజీవి ఓకే చెప్తే వీళ్లిద్దరి కాంబోలో వైల్డ్ మాస్ సినిమా రావడం ఖాయం.