సాక్షి డిజిటల్ న్యూస్ :ఢిల్లీ కారు బాంబు పేలుడు బాధితులను ప్రధాన మంత్రి మోదీ పరామర్శించారు. ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేలుడు బాధితులను పరామర్శించారాయన. ఆస్పత్రికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల బృందంతో సమావేశమై మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు ప్రమాదంలో 12 మంది మృతి చెందగా... 24 మంది గాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఓ ఇంటర్నల్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. సోమవారం జరిగిన బాంబు పేలుడు విచారణను హోం మంత్రిత్వశాఖ మంగళవారం ఎన్ఐఏకి అప్పగించింది. నిఘా వర్గాలు దీన్ని ఉగ్రవాద దాడిగా భావిస్తూ ఉపా సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేశాయి. ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనుమానితుడు ఫోటోను కూడా విడుదల