సాక్షి డిజిటల్ న్యూస్ :తిరుమల తిరుపతి కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి అప్రూవర్‌గా మారినట్టు తెలుస్తోంది. బోర్డు మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఒత్తిడి వల్లనే అన్నీ జరిగినట్టు.. ధర్మారెడ్డి అంగీకరించారని సమాచారం. కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో ధర్మారెడ్డి కీలక సమాచారం అందించినట్టు తెలుస్తోంది. టీటీడీకి సరఫరా అయిన నెయ్యి కల్తీగా ఉందని సీఎఫ్‌టీఆర్‌ఐ రిపోర్టులో స్పష్టమైన తరువాత కూడా తాను ఆ రిపోర్టు చూశానని, బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే బాగుండేదని విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో కల్తీ నెయ్యి కేసులో ధర్మారెడ్డి అప్రూవర్‌గా మారడం విచారణకు కొత్త మలుపు తీసుకువచ్చింది. ధర్మారెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో.. కల్తీ నెయ్యి సరఫరా జరుగుతోందని అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డికి కూడా తెలిసినట్టు సమాచారం తెలిసింది. దీంతో ఈ పరిణామం టీటీడీ వ్యవహారాలపై పెద్ద చర్చకు దారితీస్తోంది. ఇక కల్తీ నెయ్యిపై మరింత ఆరా తీసి లోతుగా పరిశీలిస్తున్నారు.