Header Banner

జర్నలిస్ట్ మోహన్ కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం.

(సాక్షి డిజిటల్ న్యూస్) నవంబర్ 13 కల్లూరు మండల ప్రతినిధి సురేష్ :-

ఇటీవల కాలంలో తీవ్ర అనారోగ్యంతో మృతి చెందిన జర్నలిస్ట్ దివంగత వేము మోహన్ బాబు కుటుంబ సభ్యులు భా ర్య వేము రాజకుమారి, కుమారుడు వేము మధు, వేము మాధురిలకు సీనియర్ జర్నలిస్టు ఎస్.కె అబ్దుల్ మున్నాఫ్ ఆధ్వర్యంలో మండల జర్నలిస్టుల చేతుల మీదుగా బుధవారం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా మోహన్ చిత్రపటానికి నివాళులర్పించి, వారి ఆత్మ శాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం వారు మాట్లాడుతూ మండల పరిధిలోని లింగాల గ్రామానికి చెందిన వేము మోహన్ పత్రికారంగంలోకి వచ్చిన అనతి కాలంలోనే అందరి మన్ననలను చూరగొన్నాడు. మండల రిపోర్టర్గా, నియోజకవర్గ, జిల్లా స్టాపర్ గా పలు పత్రికలలో తన సేవలు అందించాడని అన్నారు. అతి చిన్న వయసులోనే ఆయన అకాల మరణం చెందడం, కుటుంబ పరంగా కనీసం సరైన నివాస గృహాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేకపోవడం, పాపా,బాబు చిన్న పిల్లలు అవడంతో చలించిపోయిన తాము కుటుంబానికి కొంత ఆర్థిక భరోసా కల్పించాలని ఆలోచన చేసి తోటి జర్నలిస్టులు, దాతల సహకారంతో ఒక లక్ష రూపాయలు సేకరించి ఎస్బిఐ నందు చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్ లో ఫిక్స్ డిపాజిట్ చేసి 10 సంవత్సరముల తర్వాత పెద్ద మొత్తంలో ఆ కుటుంబానికి అందేలాగా ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా సహకరించిన దాతలు అందరికీ వినమ్ర నమస్కారములు తెలిపారు. మోహన్ కుటుంబాన్ని ప్రభుత్వo ఆదుకోవాలని కోరారు. జర్నలిస్టులు వృత్తి పోరాటంలో తమ సేవలు అందిస్తూ ఆర్థికంగా చితికి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు మరణిస్తే వారి కుటుంబాలు అన్యాయం అయిపోతున్నాయని వాపోయారు. జర్నలిస్టులు అందరూ ఐకమత్యంతో ఒకరి ఒకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు పోవాలని, జర్నలిస్టులు వెల్ఫేర్ ఫండ్ కోసం ప్రతినెల ప్రతి ఒక్కరూ కొంత నగదు తయారు చేయాలని ఆ మొత్తాన్ని జర్నలిస్టుల సంక్షేమం కోసం ఉపయోగించలా కార్యచరణ చేపట్టాలని నిర్ణయించారు. మోహన్ కుటుంబానికి ఎల్లవేళలా అందుబాటులో అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల జర్నలిస్టు మిత్రులు ధర్నాసి బాలరాజు, వేము రాంబాబు, ఉబ్బన బాబురావు, కోట పుల్లయ్య, చెవుల నరేష్, జర్పుల సురేష్, రాసుకో సాంబ, బొల్లం శంకర్, భూక్య శ్రీనివాస్, మండల జర్నలిస్టుల సానుభూతిపరుడు, సిపిఐ మండల కార్యదర్శి దామాల దయాకర్,తదితరులు పాల్గొన్నారు.