Header Banner

విశాఖలో కాలుష్య సంకేతాలు తీవ్రం — అధికారులు అలర్ట్

సాక్షి డిజిటల్ న్యూస్ :ఉత్తరాంధ్రలో గాలి కాలుష్యం రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా విశాఖలో కాలుష్యం తీవ్ర స్థాయికి  చేరువలో ఉంది. ఇది ఊహ కాదని, ఇటీవల బయటకు గుణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. గాలి కాలుష్యంతో నగర వాసులు శ్వాస సమస్యలు, అలసట, దగ్గు వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇది కేవలం విశాఖపట్నంకే పరిమితం కాలేదు, అనకాపల్లి, శ్రీకాకుళం ప్రాంతాల్లో కూడా గాలిలో నాణ్యత రోజు రోజుకూ తగ్గుతున్నట్లు అధికారులు తెలిపారు. చల్లటి వాతావరణం మొదలైనప్పటి నుంచి గాలిలోని పొగ, దుమ్ము కిందకి దిగి నేలమీదే ఉండిపోవడంతో ప్రజలు శ్వాస తీసుకోవడంతో..అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని, ఈ పరిస్థితి ఊపిరితిత్తులకు హానికరమని వైద్యులు చెబుతున్నట్లు అధికారులు వెల్లడించారు.అయితే ఇది కొత్త సమస్య కాదు.. ఉత్తరాంధ్రలో ఏడాది క్రితమే ఫార్మా, కెమికల్ ఫ్యాక్టరీలు వేగంగా పెరిగాయి. ఇవి మొదట్లో రాజధాని హైదరాబాద్‌లో ఉండేవి. ఆ తర్వాత వాటిని విశాఖ, శ్రీకాకుళం ప్రాంతాలకు తరలించారు. అక్కడ పరిశ్రమల వ్యర్థాలను సరిగ్గా శుద్ది చేయడపోవడంతో గాలి, నీటి కాలుష్యం వేగంగా పెరిగింది. అంతేకాదు వాహనదారులు ప్రయాణించే సమయంలో కూడా పరిశ్రమలు వద్ద ముక్కులను మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.గతంలో ఏర్పాటైన ఫార్మాసిటీతో ఈ ప్రాంతంలో మరికొన్ని కంపెనీలు స్థాపించారు. అక్కడ పరిశ్రమలు అభివృద్ధికి సంకేతం అయినప్పటికీ, పరిశ్రమల కారణంగా పర్యవరణం పాడైపోతుంది. అయితే ఇప్పుడు ఆ ప్రభావం గాలి నాణ్యతపై స్పష్టంగా కనిపిస్తోంది. సెంట్రల్ పొల్యూషన్‌ కంట్రోల్ బోర్డు నివేదిక ప్రకారం.. విశాఖలో గతవారంతో పోల్చుకుంటే గాలి నాణ్యత సూచీ గణనీయంగా పెరిగింది. మోడరేట్ టు పూర్ స్థాయిలో ఇది ఉందని వెల్లడించారు. ముఖ్యంగా దీని ప్రభావంతో శ్వాసకోశ లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారికి ప్రమాదకరమని చెబుతున్నారు. ఇక, చలి ఎక్కవగా ఉన్న రోజుల్లో సాధ్యమైనంత వరకు ప్రజలు బయటకు రాకుండా ఇంట్లో ఉండటం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ బయటకు రావాల్సి వస్తే.. నాణ్యమైన మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఊపరితిత్తులు, ఆస్థమా సమస్యలు ఉన్నావారు జాగ్రత్తగా ఉండాలని, ఇన్హేలర్‌లు క్రమం తప్పకుండా వాలని తెలిపారు. ఇక, విశాఖలో పెరుగుతున్న కాలుష్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని, పరిశ్రమలు, ప్రజలు,  ప్రభుత్వం అందరూ కలసి చర్యలు తీసుకుంటేనే గాలి నాణ్యతను కాపాడుకోవచ్చని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.