సాక్షి డిజిటల్ న్యూస్ : డెబ్యూ మూవీ ఉప్పెనతోనే హీరోగా బ్లాక్ బస్టర్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు వైష్ణవ్ తేజ్. ఈ మూవీతో ఏకంగా వంద కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను కొల్లగొట్టేశాడీ మెగా క్యాంప్ కథానాయకుడు. మంచి పెర్ఫామెన్స్‌తో ప్రేక్షకులను మెప్పించాడు వైష్ణవ్ తేజ్. ఈ మూవీ తర్వాత వైష్ణవ్ తేజ్‌తో సినిమాలు చేయటానికి మేకర్స్ క్యూ కట్టారు. కొండ పొలం, రంగ రంగ వైభవంగా, ఆది కేశవ సినిమాల్లో నటించిన ఈ యంగ్ హీరోకి షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి. వరుసగా మూడు ఫ్లాప్స్ తర్వాత వైష్ణవ్ తేజ్ కెరీర్‌పై ఫోకస్ పెంచేశాడు. అందుకోసం సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు వహిస్తున్నాడు. వైష్ణవ్ తేజ్ సినిమాలు వచ్చి రెండేళ్లు దాటేసింది. కొత్త కథలను వింటున్నాడు. ఇంకెప్పుడు సినిమా చేస్తాడా! అని అందరూ అనుకుంటున్న తరుణంలో ఇండస్ట్రీ వర్గాల సమాచార మేరకు వైష్ణవ్‌కు డైరెక్టర్ దొరికేశాడు. మనం, 24, 12బీ, ఇష్క్ వంటి చిత్రాలతో సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న విక్రమ్ కె కుమార్లో వైష్ణవ్ సినిమా చేయబోతున్నాడట. థాంక్యూ సినిమాతో డిజాస్టర్ ఫేస్ చేసిన విక్రమ్ కుమార్.. తర్వాత దూత అనే వెబ్ సిరీస్ చేసి హిట్ కొట్టాడు. అయితే నెక్ట్స్ సినిమాను చేయటానికి మాత్రం చాలా సమయం పడుతుంది. ఏవీ వర్కవుట్ కావటం లేదు. దీంతో ఈ డైరెక్టర్ రీసెంట్గా వైష్ణవ్‌ను కలిసి చెప్పిన కథ నచ్చటంతో ఈ యంగ్ హీరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు టాక్.