జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జెండా ఎగిరింది—నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపు

సాక్షి డిజిటల్ న్యూస్ :జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికలో కాంగ్రెస్ సత్తా చాటింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. 24,658 ఓట్ల మెజారిటీతో గెలిచిన నవీన్‌ యాదవ్‌ గెలిపొందారు. పోస్టల్ బ్యాలెట్ మొదలు ఫస్ట్ రౌండ్ నుంచి చివరి వరకు కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగింది. రౌండ్ రౌండ్‌కు మెజార్టీ పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా షేక్‌పేట్, వెంగళ్‌రావు నగర్, రెహమత్ నగర్ డివిజన్లలో కాంగ్రెస్‌కు మంచి ఆధిక్యం లభించింది. దీంతో భారీ మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధించింది. బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచి.. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. మరోవైపు బీజేపీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఆ పార్టీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. కౌంటింగ్ మధ్యలో నుంచే బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి వెళ్లిపోయారు.నవీన్ యాదదవ్ గెలుపుతో కాంగ్రెస్ శ్రేణులు గెలుపు సంబరాల్లో మునిగిపోయింది. గాంధీభవన్ వద్ద పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని నేతలు, కార్యకర్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సంబరాల్లో మంత్రులు సైతం పాల్గొన్నారు. హైదరాబాద్ మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. మండల, జిల్లా కేంద్రాల్లో టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు షేక్‌పేట్, వెంగళ్‌రావు నగర్, రెహమత్ నగర్ డివిజన్ల ఓట్ల లెక్కింపు పూర్తైంది. ఈ మూడు డివిజన్లలోనూ కాంగ్రెస్‌కు భారీ ఆధిక్యత వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *