సాక్షి డిజిటల్ న్యూస్ :నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ‘ప్యారడైజ్’ చిత్రం వచ్చే ఏడాది రానుంది. మార్చిలో విడుదల కానున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు వదిలిన పోస్టర్లు, గ్లింప్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో అంచనాల్ని రెట్టింపు చేశాయి. ఇక ఈ చిత్రంలో విలన్ పాత్రకు సంబంధించిన గాసిప్ ఎంతగా ట్రెండ్ అయిందో అందరికీ తెలిసిందే. మోహన్ బాబు లుక్ కూడా మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి అనిరుధ్ అందించే మ్యూజిక్ అద్భుతంగా ఉండబోతోంది. నాని, అనిరుధ్ కాంబోలో వచ్చే పాటలన్నీ కూడా శ్రోతల్ని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇక ఈ ప్యారడైజ్ చిత్రంలోనూ అద్భుతమైన ట్యూన్స్‌ని అనిరుధ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయాలని టీం ప్లాన్ చేస్తోందట. డిసెంబర్ మొదటి వారంలో ఈ ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేసేందుకు టీం రెడీగా ఉందట.మరి ఈ మేరకు ప్యారడైజ్ టీం నుంచి కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. కాకుల స్టోరీ అంటూ ప్యారడైజ్ చిత్రం మీద బజ్‌ను క్రియేట్ చేశారు. టైటిల్ పోస్టర్ చూస్తుంటే హైద్రాబాద్, చార్మినార్ బ్యాక్ డ్రాప్లో కథ సాగేలా ఉంది. ఇక ఈ చిత్రంతో దసరాని మించి బ్లాక్ బస్టర్ సాధించాలని శ్రీకాంత్ ఓదెల రెడీగా ఉన్నాడు. ఇక ఈ ప్యారడైజ్ తరువాత శ్రీకాంత్ ఓదెల అయితే మెగాస్టార్ చిరంజీవి ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కిస్తాడన్న సంగతి తెలిసిందే.నాని అయితే ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతోన్నాడు. చివరగా హిట్ 3 అంటూ మంచి విజయాన్ని అందుకున్నాడు. సరిపోదా శనివారం, హిట్ 2, హాయ్ నాన్న, దసరా ఇలా అన్నీ కూడా మంచి సక్సెస్‌లతో నాని దూసుకుపోతోన్నాడు. ఇక ‘ప్యారడైజ్’తో పాన్ ఇండియా రేంజ్లో నాని విజయాన్ని అందుకునేందుకు రెడీగా ఉన్నాడని అర్థం అవుతోంది.