Header Banner

తెలంగాణ రాజకీయ వాతావరణం: హైకోర్టు మళ్లీ ఎన్నికల ఆదేశాలతో కీలక తీర్మానం

సాక్షి డిజిటల్ న్యూస్:తెలంగాణలో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. లోకల్ బాడీ ఎన్నికలపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 24వ తేదీ లోపు లోకల్ బాడీ ఎన్నికలపై తేల్చాలని సూచించింది.మేం రిజర్వేషన్ల మీదే అభ్యంతరం చెప్పాం కానీ ఎన్నికల నిర్వహణఫై కాదని హైకోర్టు పేర్కొంది. బీసీ రిజర్వేషన్లపై వివాదం లేనిచోట ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్‌ఈసీ పేర్కొనడంతో.. ఎస్‌ఈసీ తీరుపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విభజించి ఎన్నికలు నిర్వహించడం సరికాదని హైకోర్టు సూచించింది. నవంబర్ 24వ తేదీలోపు ఎన్నికల తేదీలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.