‘జన నాయగన్’ సూపర్ హిట్: ఇండస్ట్రీ రికార్డులు

సాక్షి డిజిటల్ న్యూస్ :దళపతి విజయ్ చివరి సినిమాగా ‘జన నాయగన్’ (తెలుగులో జన నాయకుడు) రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని బాలయ్య, అనిల్ రావిపూడి ‘భగవంత్ కేసరి’కి రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారని టాక్. మొత్తంగా రీమేక్ కాకపోయినా ‘భగవంత్ కేసరి’ మూవీలోని ప్లాట్, కొన్ని పాయింట్స్‌ను మాత్రం ఉన్నది ఉన్నట్టుగా వాడుకుంటారట. ఇక ఈ చిత్రంలోని మొదటి పాటను రిలీజ్ చేసిన తరువాత ఈ పోలికలు మరింత ఎక్కువగా అయ్యాయి. ఒరిజినల్‌లో శ్రీలీల ఎలా కనిపించిందో.. మెడకి ఎలాంటిది ధరించిందో.. రీమేక్‌లో మమితా బైజు కూడా అలానే కనిపించింది.. అలాంటి తాడునే కట్టుకుంది. ఇక ఇది పూర్తిగా రీమేక్ అని కోలీవుడ్, టాలీవుడ్ ఆడియెన్స్ ఫిక్స్ అయ్యారు. తెలుగు సినిమాని రీమేక్ చేసి.. మళ్లీ తెలుగులోనే డబ్ చేసి.. మళ్లీ తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తున్నారా? అని ఇక్కడి ప్రేక్షకులు ట్రోలింగ్ చేస్తున్నారు.ఇక కోలీవుడ్‌లో మాత్రం జన నాయగన్ చిత్రానికి మంచి డిమాండ్ ఉందని తెలుస్తోంది. ఇది అక్కడ ఇండస్ట్రీ రికార్డ్ అని, ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. దాదాపు మూడు వందల కోట్లకు పైగా బిజినెస్ చేసిందని అంటున్నారు. ఓటీటీ రైట్స్ అయితే వంద కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే 120 కోట్ల వరకు ఉంటుందని టాక్. ఇక ఓవర్సీస్ రైట్స్ అయితే 70 నుంచి 80 కోట్ల రేంజ్‌ ఉంటుందని సమాచారం. ఆడియో రైట్స్ అయితే 35 కోట్ల వరకు ఉండొచ్చని టాక్. అలా మొత్తంగా మూడు వందల కోట్లకు పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని అంటున్నారు. ఇక థియేట్రికల్ పరంగా విజయ్ ఎంత రాబడతాడో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *