Header Banner

అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి —- సిపిఎం ఏన్కూర్

సాక్షి డిజిటల్ న్యూస్ 14 నవంబర్ ఏన్కూర్ రిపోర్టర్ గుగులోత్ మజిలాల్

ఏన్కూరు మండలంలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్య వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిపిఎం ఏన్కూర్ మండల కమిటీ సమావేశం బానోత్ బాలాజీ అధ్యక్షతన సిపిఎం ఆఫీస్ ఏన్కూర్ నందు జరిగింది ఈ కార్యక్రమంలో భూక్య వీరభద్రం ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సర్వే నిర్వహించి ఎకరాకు పదివేల రూపాయలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏన్కూరు మండలంలో ప్రధానమైన పంటలు ప్రతి మిర్చి వరి గా ఉన్నాయని అవి ఇటీవల కురిసిన తుఫాను వల్ల పూర్తిగా దెబ్బతినిపోయ అని ఎకరాకు 10 నుండి 15 కింటాలు రావలసినటువంటి పత్తి ఎకరాకు రెండు మూడు క్వింటాలు వస్తుందని దానికి కూడా పూర్తి మద్దతు ధర లేక రైతులు గగ్గోలు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే మిర్చి పంటకు తెగుళ్లు వచ్చి పూర్తిగా దెబ్బతింటుందని అటువంటి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వా నీదే.అలా ఆదుకుంటే నే రైతు ఆత్మహత్యలు తగ్గుతాయని ఆయన అన్నారు రైతులను ఆదుకోకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఆయన అన్నారు అనంతరం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్ మాట్లాడారు దేశ రాజకీయాలలో పెను మార్పులు సంభవిస్తున్నాయని పెట్టుబడిదారీ విధానం అంతరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈనాడు అమెరికా నడిబొడ్డున కమ్యూనిస్టులు మేయర్గా ఎన్నికయ్యారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి దొంతబోయిన నాగేశ్వరరావు మాజీ ఎంపీటీసీ భూక్యలక్ష్మ మండల కమిటీ సభ్యులు ఏర్పుల రాములు ఇటుకల లెనిన్ నండూరి �