అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకోవడంతో భక్తుల్లో ఉత్సాహం – ప్రతిరోజు వేల మందికి దర్శన అవకాశం

సాక్షి డిజిటల్ న్యూస్ :శబరిమల అయ్యప్ప సన్నిధిలో 41 రోజుల మండల తీర్థయాత్ర షురూ అయింది.. శబరిమల ఆలయం తెరుచుకుంది.. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఆలయంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి భక్తులకు సంబంధించి రూల్‌బుక్ కొద్దిగా మార్చింది ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు..స్వామియే శరణం అయ్యప్ప.. తెరుచుకున్న శబరిమల ఆలయం.. మండల కాలం పాటు దీక్షచేసి, ఇరుముడి కట్టుకుని వచ్చి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటున్నారు. ఈ ఏడాది మండల పూజలకు ఆలయ ద్వారాలు తెరిచారు. రోజుకు 90 వేల మందిని అనుమతిస్తారు. ఆన్‌లైన్ బుకింగ్‌లు, ప్రసాదాల ఆర్డర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉండటంతో టీడీబీ కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. యాత్రా మార్గంలో భద్రత పెంచారు. మొత్తం 18వేల మంది పోలీసు సిబ్బందిని నియమించారు.శబరిమల అయ్యప్ప మాలధారులకు, దీక్షాపరులకు కీలక ఘట్టం మండలదీక్షలు. ఈ ఏడాది ఇరుముడి కట్టుకుని అయ్యప్ప స్వామిని దర్శించుకునే భక్తుల కోసం నిన్న సాయంత్రం ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ప్రధాన పూజారి 18 పడిమెట్లు మీదుగా దిగి, సన్నిధానం నుంచి తీసుకొచ్చిన జ్వాలతో పవిత్ర గుండాన్ని వెలిగించారు. అనంతరం పూజారుల చేతులను పట్టుకుని గర్భగుడి వద్దకు తీసుకెళ్లారు. దీంతో సోమవారం తెల్లవారుజామున నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నారు. ప్రతీరోజూ తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనాలు ఉంటాయి. రోజుకు 90 వేల మందిని దర్శనానికి అనుమతిస్తారు. రోజుకు 70 వేల వర్చువల్ క్యూటోకెన్లు, స్పాట్ బుకింగ్ ద్వారా 20 వేల టోకెన్లు జారీచేస్తారు.నవంబరు 17 నుంచి 41 రోజుల పాటు కొనసాగే మండల పూజ డిసెంబర్ 27న ముగుస్తుంది. ఆ రోజు రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేసి.. మళ్లీ మకరజ్యోతి పూజల కోసం డిసెంబర్ 30న తెరుస్తారు. 2026 జనవరి 14న మకర జ్యోతి దర్శనం, 20న పడిపూజ తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు. ఈ ఏడాది భక్తుల సంఖ్య భారీగా పెరగవచ్చన్న అంచనాలున్నాయి. దీంతో యాత్రా మార్గంలో భద్రతను మరింత పెంచారు. ఆలయ పరిసరాల్లో ఫోటోలు, వీడియోలు నిషిద్ధం అంటూ భక్తులకు నిబంధనలు కఠినతరం చేసింది ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్..


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *