Header Banner

గని ప్రాంతంలో వంతెన కూలిపోగా భారీ ప్రాణనష్టం—కాంగో ప్రభుత్వ విచారణ ఆదేశాలు

సాక్షి డిజిటల్ న్యూస్ :ఆఫ్రికా దేశంలోని కాంగోలో ఘోర ప్రమాదం జరిగింది.  రాగి గనిలో వంతెన కూలి 32 మంది మృతిచెందారు. లువాలాబా ప్రావిన్స్‌లోని కలాండో శనివారం నాడు ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మైనింగ్ స్థలంలో నిత్యం వందలాది కార్మికులు పని చేస్తుంటారు. అయితే ఒక్కసారిగా కాల్పులు శబ్దం వినిపించడంతో.. భయపడిన కార్మికులు ఆ ఇరుకైన వంతెనపై పరుగులు తీశారు. దీంతో వంతెన కుప్పకూలినట్లు మైనింగ్ ఏజెన్సీ తెలిపింది. అయితే ఈ ప్రమాదంలో గని క్రింత కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అయితే ఆ దేశంలోని ప్రజలకు మైనింగ్ గని ప్రధాన జీవనాధరం. ఈ గనిలో దాదాపు 15 నుంచి 20 లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఇక, పరోక్షంగా లక్షలాది దీని మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే ఇంత మంది ఉపాధి పొందుతున్న ఈ గని కనీస భద్రతా చర్యలు లేకపోవడంతో.. గతంలోనూ ఈ గనిలో చాలా ప్రమాదాలు  జరిగి చాలా మంది మరణించారు.