స్టార్ నటి సంచలన వ్యాఖ్యలు: మహేష్–నమ్రతపై చేసిన స్టేట్‌మెంట్ హాట్ టాపిక్!

సాక్షి డిజిటల్ న్యూస్ :టాలీవుడ్‌లో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ ఒకే ఒక్క డైలాగ్ ..‘నమ్రతా, మహేష్ సితారను బయటకు తీసుకురాకపోతే ఇద్దరినీ కొట్టేస్తాను!’. ఈ మాటలు ఎవరివో ఊహించడం కష్టం కాదు కానీ, అంత ధైర్యంగా మహేష్​ బాబుని కొట్టేస్తాననడం మాత్రం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.సూపర్‌స్టార్ మహేష్ బాబును, నమ్రతా శిరోద్కర్‌ను ఇంత సన్నిహితంగా టీజ్ చేయగలిగే వాళ్లు టాలీవుడ్​లో చాలా తక్కువ. ఓ స్టార్​ నటి మాట్లాడిన మాటలు వింటే ఎవరైనా షాకవుతారు. కానీ, ఆమె టోన్‌లో హాస్యం, ఆత్మీయత, అక్కున చేర్చుకునే సన్నిహిత బంధమే కనిపిస్తుంది. మహేష్-నమ్రతలతో ఆమెకున్న సంబంధం కేవలం స్నేహం కాదు, కుటుంబ బంధం కూడా.

స్వేచ్ఛ ఇవ్వాలి.. సితార ఘట్టమనేని ఇప్పటికే సోషల్ మీడియా సెలబ్రిటీ. డాన్స్, ఫ్యాషన్, చిన్న రోల్స్‌తో ఆమె టాలెంట్ కనిపిస్తోంది. కానీ మహేష్-నమ్రత ఇంకా ఆమెను పెద్దగా లాంచ్ చేయలేదు. ఈ విషయంపై మాట్లాడుతూ ఓ స్టార్ నటి గట్టిగా అడిగింది ‘నమ్రత చాలా ఆధునిక భావాలుగల మహిళ, మరాఠీ మాతృస్వామ్యంలో పెరిగింది. సితారకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. లేదంటే నేను నమ్రత, మహేష్​ ఇద్దరినీ కొట్టేస్తా!’ అని నవ్వుతూ హెచ్చరించింది. టాలీవుడ్‌లో స్టార్ కుమారులకే కాదు, కుమార్తెలకూ సమాన అవకాశాలు రావాలన్నదే ఆ మాటల వెనుక గల సారాంశం.ఆ నటి మరెవరో కాదు – మంచు లక్ష్మి! మోహన్ బాబు కూతురు, టాలీవుడ్‌లో బోల్డ్ నటిగా, నిర్మాతగా, టాక్ షో హోస్ట్‌గా గుర్తింపు పొందిన లక్ష్మి మంచు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహేష్​ కుటుంబం గురించి, సితార గురించి మాట్లాడింది. సితారా ఘట్టమనేని చిన్నప్పటి నుంచి సోషల్ మీడియా స్టార్. డాన్స్ వీడియోలు, ఫ్యాషన్ షూట్లు, ‘మా హొంమే’లో చిన్న రోల్ చేసింది. ఇటీవల జరిగిన ‘వారణాసి’ సినిమా ఈవెంట్​లో మహేష్-నమ్రతతో కలిసి పాల్గొంది సితార. ఇప్పటికే లక్షలాది మంది ఫాలోవర్లతో సోషల్ మీడియాని షేక్​ చేస్తోంది. కానీ మహేష్-నమ్రత ఆమెను ఇంకా పెద్దగా ఇండస్ట్రీలోకి తీసుకురాలేదు. ఇదే విషయంపై లక్ష్మి ఫైర్ అయింది.అయితే వ్యాఖ్యల వెనుక ఒక బలమైన సందేశం ఉంది. టాలీవుడ్‌లో స్టార్ కుమారులు హీరోలుగా ఎంట్రీ ఇస్తుంటే, స్టార్ కుమార్తెలు మాత్రం ఇంకా వెనుకంజలోనే ఉన్నారు. శ్రుతి హాసన్, లక్ష్మి మంచు వంటి కొద్దిమంది తప్ప ఎంతమంది స్టార్ కూతుళ్లు ఇక్కడ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు? ఈ ప్రశ్నే లక్ష్మి లేవనెత్తింది. ‘పితృస్వామ్యాన్ని తొలగించలేను… కానీ దానిని ఛేదించి మార్గం కనుగొనాలి’అని ఆమె చెప్పిన మాటలు ఎంతోమంది యువతులకు స్ఫూర్తిగా నిలుస్తాయి. మహేష్-నమ్రతలు లక్ష్మి మాటలకు ఇంకా రిప్లై ఇవ్వలేదు. కానీ సితారా ఘట్టమనేని రోజు రోజుకీ పెరుగుతున్న ఆమె ఫ్యాన్ బేస్ చూస్తే లక్ష్మి కోరిక త్వరలోనే నెరవేరే అవకాశం ఉంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *