సాక్షి డిజిటల్ న్యూస్ :బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ మరోసారి బాధ్యతలు స్వీకరించడానికి రంగం సిద్ధమైంది. బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఇవాళ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 10వ సారి ముఖ్యమంత్రిగా నితీశ్ ప్రమాణ చేయబోతున్నారు. నితీశ్ తొలిసారి 2000 ఏళ్లలో సీఎం అయ్యారు. అప్పటి నుంచి బీజేపీ, ఆర్జేడీ, కాంగ్రెస్, లోక్ జన్ శక్తి.. ఇలా ఎన్నో పార్టీలతో కలిసి సీఎం పిఠాన్ని అధిరోహించారు.నేడు బీహార్ సీఎంగా 10వ సారి ప్రమాణస్వీకారం చేయనున్నారు నితీష్ కుమార్. తాజాగా జరిగిన ఎన్డీఏ శాసనసభ్యుల సమావేశంలో ఆయనను ఎన్డీఏ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు బీజేపీ నేత సమ్రాట్ చౌధరీ నితీశ్ పేరును ప్రతిపాదించగా.. సమావేశం మొత్తం ఆయనకు మద్దతు తెలిపింది. ఎన్డీఏ సమావేశం అనంతరం నితీశ్ కుమార్ రాజ్‌భవన్‌కు వెళ్లి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. అనంతరం ఎన్డీఏ మిత్రపక్షాల మద్దతు పత్రాలను గవర్నర్ అరీఫ్ మహ్మద్ ఖాన్‌కు అందజేసి ప్రభుత్వ నిర్మాణానికి అవకాశం కావాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ నితీశ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.పట్నా గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎన్డీఏ తమ భారీ ప్రజాతీర్పుకు సంకేతంగా ప్రదర్శించనుంది.