ఉస్తాద్ భగత్‌సింగ్ రిలీజ్ డేట్‌పై క్లారిటీ—పవన్ అభిమానుల్లో డిసప్పాయింట్‌

సాక్షి డిజిటల్ న్యూస్:పవర్‌స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ నటిస్టోన్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. OG బ్లాక్ బస్టర్ విజయంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌లో స‌రికొత్త ఎన‌ర్జీ వ‌చ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. గ‌బ్బ‌ర్ సింగ్ వంటి సెన్సేష‌నల్ మూవీని ప‌వ‌న్‌తో తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ దీన్ని డైరెక్ట్ చేస్తుండ‌టంతో సినిమా కోసం అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా వెయిట్ చేస్తున్నారు. మూవీ విడుదలపై ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ చివరకు స్పందించింది. నిర్మాత రవిశంకర్ ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే స్పెసిఫిక్ రిలీజ్ డేట్‌ను మాత్రం ప్రకటించలేదు. ఇదే విషయంపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ ఫిబ్రవరిలోనే సినిమా థియేటర్లకు రాబోతుందనే ప్రచారం నడిచిన నేపథ్యంలో అకస్మాత్తుగా ఏప్రిల్‌కు విడుద‌ల‌ను మార్చడంపై అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఇంత ఆలస్యమెందుకు’, ‘ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తే బెటర్’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ నెలల క్రితమే పూర్తయింది. రాజకీయ బిజీ షెడ్యూల్ మధ్యే పవన్ జెట్ స్పీడ్‌తో తన భాగాన్ని ముగించాడు. మిగిలిన షూటింగ్ పార్ట్ కూడా ఇటీవలే పూర్తై, ఐదు ఆరు రోజుల ప్యాచ్‌వర్క్ మాత్రమే బ్యాలెన్స్‌లో ఉన్నట్లు సమాచారం.సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వేగంగా సాగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటల రికార్డింగ్ దాదాపుగా ముగిసింది. మొదటి సింగిల్‌ను డిసెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెరికి ఇది రీమేక్. అయితే హరీష్ దాన్నెంతో కొత్తగా మార్చాడని సినీ వర్గాలంటున్నాయి.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *