సాక్షి డిజిటల్ న్యూస్:బీహార్ సీఎంగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. జనతా దళ్ (యునైటెడ్) అధ్యక్షుడు నితీష్ కుమార్ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో బీహార్ సీఎంగా రికార్డు స్థాయిలో పదో సారి ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాలోని గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, ఏపీ సీఎం చంద్రబాబు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.