సాక్షి డిజిటల్ న్యూస్ :మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ పీరియాడికల్ థ్రిల్లర్ ‘కాంత’. ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొన్ని రోజులకే ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. తెలుగుతో పాటు తమిళ భాషల్లోనూ విడుదలైన ఈ చిత్రం విభిన్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నా, ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయింది. తాజా సమాచారం ప్రకారం ‘కాంత’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి పొందింది. డిసెంబర్ 12 నుంచి ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో కలెక్షన్లు తక్కువగా వచ్చినప్పటికీ ఓటీటీ రైట్స్ మాత్రం మంచి ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. మొత్తం భాషల డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సుమారు 40 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు ప్రచారం. ఈ డీల్‌తో నిర్మాతలైన రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ భారీగా లాభపడ్డారని సమాచారం.1960ల నేపథ్యంలో, సినిమా ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథను సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. రానా దగ్గుబాటి, సముద్రఖని కీలక పాత్రల్లో నటించగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయకిగా కొలీవుడ్‌లో ఈ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఓ సీనియర్ డైరెక్టర్, స్టార్ హీరో మధ్య ఈగో క్లాష్‌లు, షూటింగ్ సమయంలో జరిగిన హత్య, ఆ కేసును ఛేదించే పోలీస్ ఆఫీసర్ పాత్ర… ఈ ఆసక్తికర అంశాల చుట్టూ కాంత కథ నడుస్తుంది. నటీనటుల పరంగా దుల్కర్, రానా, సముద్రఖని, భాగ్యశ్రీ నటనలకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే స్లో నెరేషన్ కారణంగా సినిమా విమర్శల పాలైంది. 70 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అయ్యి ఇప్పటివరకు సుమారు 19 కోట్లు మాత్రమే రాబట్టిందీ చిత్రం.