కల్తీ నెయ్యి కేసులో సిట్ సుడిగాలి—వైవీ సుబ్బారెడ్డి విచారణలో కీలక మలుపు!

సాక్షి డిజిటల్ న్యూస్ :తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలకు సంబంధించిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలోనే ఈ విచారణ కొనసాగుతోంది.టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని హైదరాబాద్‌లో ఇవాళ విచారిస్తున్నారు. విజయవాడ రావాలని నోటీసులు జారీ చేసినప్పటికీ తాను రాలేనని చెప్పడంతో సిట్ అధికారులు హైదరాబాద్‌లో ఆయన ఇంట్లోనే ప్రశ్నిస్తున్నారు. వైసీపీ హయాంలో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా పని చేసిన సమయంలో లడ్డూ తయారీ నెయ్యికి సంబంధించి అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. టీటీడీకి నెయ్యి సరఫరా, ఆయా సంస్థలతో ఒప్పందాలు, చైర్మన్ హోదాలో తీసుకున్న నిర్ణయాలు వంటి అంశాలపై విచారణ జరుగుతున్నట్టు సమాచారం.కల్తీ నెయ్యి ఘటనలో దూకుడు పెంచిన సిట్ అధికారులు ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నను అరెస్ట్ చేసి విచారించారు. అయితే ఈ విచారణలో పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వైవీ సుబ్బారెడ్డిని సైతం విచారిస్తున్నట్లు సమాచారం. ఈ విచారణ తర్వాత కేసులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అనే ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *