Header Banner

బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు—రెండు పార్టీలు ఒకటేనన్న స్ట్రాంగ్ కౌంటర్

సాక్షి డిజిటల్ న్యూస్ :కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్నారు బండి. రాష్రంలో RK పాలన నడుస్తోందన్నారు బండి. RK అంటే రేవంత్, కేటీఆర్ అని వివరణ ఇచ్చారు. ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్‌పై సీఎం ఏం చేస్తారో చూడాలన్నారు. ఇంతకాలం కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదని కేంద్రాన్ని టార్గెట్ చేశారని.. ఇప్పుడు సీఎం ఏం చేస్తారో సమాధానం చెప్పాలన్నారు.ఇద్దరి దోస్తానా ఇప్పుడు బయటపడుతుందన్నారు బండి సంజయ్. ఆస్తులు వెనక్కి కక్కిస్తా, జైలుకు పంపుతా అని రేవంత్ అన్నారు కదా రెండేళ్లయింది ఎవరినైనా జైలుకు పంపారా? అని బండి ప్రశ్నించారు.ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ జిష్టుదేవ్ వర్మ అనుమతించడంతో.. బండి సంజయ్ స్పందించారు.