దేశాన్ని కుదిపిన ఘటనలో మరో అప్డేట్—ఉమర్ నబీ ప్రస్థానం పై అధికారులు దృష్టి

సాక్షి డిజిటల్ న్యూస్ :ఢిల్లీ పేలుడు కేసులో ప్రధాన ఆత్మాహుతి బాంబర్ డాక్టర్‌ ఉమర్‌ నబీకి సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్‌ ఉమర్‌ నబీ.. నుహ్‌లోని హిదాయత్ కాలనీలో ఓ అద్దె గదిలో 10 రోజులు ఉన్నట్లు తెలిసింది.ఈ గది అత్యంత అనుమానాస్పదంగా అపరిశుభ్రంగా, మురికివాడలో ఉంటూ ప్లాన్ చేసినట్లు బయటపడింది. ఈ ఇంటి యజమాని అఫ్సానా.. స్థానికంగా అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తుంది. అయితే అక్టోబర్ 27, 28 తేదీలలో షోయబ్ అఫ్సానాకు ఫోన్ చేసినట్లు రికార్డు బయటపడింది.ఈ నేపథ్యంలో అంగన్ వాడీ కార్యకర్తను వివరాలు సేకరించగా.. నవంబర్ 9వ తేదీన రాత్రి 11 గంటల ప్రాంతంలో డాక్టర్ నబీ తన హ్యుందాయ్ ఐ20 కారులో ఎవరితోనూ మాట్లాడకుండా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపింది. ఆ మరుసటి రోజే నవంబర్ 10వ తేదీన ఢిల్లీలో అదే వాహనంలో ఆత్మాహుతికి పాల్పడ్డాడు. అయితే నవంబర్ 10వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఓ పార్కింగ్ స్థలంలో వెళ్లిన ఆయన.. తిరిగి సాయంత్రం 6.28 నిమిషాలకు బయటకు వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. ఈ సమయంలోనే ఆయన కారులో ఉండి బాంబ్ తయారు చేసినట్లు గుర్తించారు.అయితే అంతకుముందు రోజు నవంబర్ 9న తెల్లవారుజామున 1:01 గంటలకు ఫిరోజ్‌పూర్ ఝిర్కాలోని ఒక ఏటీఎం వద్ద డాక్టర్ నబీ ఆగినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో  కనిపించింది. అతను తన ముఖాన్ని ముసుగుతో కప్పుకుని దాదాపు నాలుగు నిమిషాల పాటు నగదు విత్ డ్రా చేసుకున్నాడు. ఇదిలా ఉండగా, అల్ ఫల్‌హ విశ్వవిద్యాలయంలో నర్సింగ్ సిబ్బందిగా పనిచేస్తున్న షోయబ్, అఫ్సానా బంధువులు ఈ వసతిని ఏర్పాటు చేశారు. వీరిలో అతడిని కూడా అరెస్టు చేశారు.  ఆ ప్రాంతానికి ప్రైమ్ 9 ప్రతినిధి స్వయంగా వెళ్లి వివరాలు సేకరించారు. ఎవరూ సాహసం చేయలేని ప్రాంతానికి ప్రైమ్ 9 ప్రతినిధి వెళ్లగా.. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇళ్లు ఖాళీగా కనిపించాయి. ఎందుకంటే ఈ ప్రాంతానికి వెళ్లేందుకు సాహసం చేయరు. హర్యానాలోని  నూహ్ జిల్లాలో ప్రధాన నగరంగా గుర్తింపు పొందిందని, గుర్‌గావ్ నుంచి 45 కి.మీ. దూరంలో ఉంటుందని తెలిపారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *