సాక్షి డిజిటల్ న్యూస్ :అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకు షాక్ ఇచ్చారు. పుతిన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న రష్యా-ఉక్రెయిన్ శాంతి ప్రణాళికను ఆమోదించారు. దీనిపై ఎలాంటి హడావుడి లేకుండా ట్రంప్ రహస్యంగా ఆమోదం వెల్లడించారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.ఈ శాంతి ఒప్పందం కోసం ట్రంప్ టీమ్‌లోని ఓ సీనియర్ సభ్యులు కొన్ని వారాలుగా పని చేస్తున్నారు. రష్యా రాయబారి కిరిల్ డిమిత్రివ్‌తో పాటు ఉక్రెనియన్ అధికారులతో కూడా చర్చలు జరుపుతున్నారు.ఈ ప్రక్రియ ట్రంప్ మునుపటి 20-పాయింట్ల వెనుక ఉన్న ప్రణాళిక విధానాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొంది. ఈ ప్రతిపాదనను అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ నాయకత్వం వహిస్తున్నారు. ఉక్రెయిన్‌లో భద్రతా హామీలను అందించడం, శాంతిని సాధించడం, రష్యా– ఉక్రెయిన్ రెండింటితో భవిష్యత్ US సంబంధాలను వివరించడం, యూరప్‌లో స్థిరత్వాన్ని నిర్ధారించడం వంటి అంశాలతో ఈ శాంతి ఒప్పందం ప్రణాళికకు ఆమోదించారు.