కవిత వ్యాఖ్యలు: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందే అని విమర్శ

సాక్షి డిజిటల్ న్యూస్ : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందే అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కామెంట్ చేశారు. రంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నాయకులకు ఇతరులపై కేసులు పెట్టడం తప్పా ఇంకో పని లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు గమనిస్తున్నారనన్నారు.ప్రజలకు ముఖం చూపించలేక ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. వీటన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని, చట్టం, న్యాయం మీద మాకు నమ్మకం ఉందన్నారు.  రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని, అందులో నంబర్ వన్ బాధితురాలిని నేనే అన్నారు. ఇప్పుడు ఇంకా ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడుతున్నారన్నారు.శేరిలింగంపల్లి నియోజకవర్గం దేశంలోనే ధనిక నియోజకవర్గమని అంటున్నారన్నారు. పెద్ద పెద్ద బంగ్లాలు, విల్లాలు, కంపెనీలు, ధనవంతులు ఇక్కడ ఉన్నారన్నారు. అదే సమయంలో దీపం కిందనే నీడ ఉన్నట్లు ఇక్కడ పేదలు, పేద బస్తీలు ఉన్నాయన్నారు. పేదలను పట్టించుకునే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదన్నారు. ఉచిత కరెంట్, గ్యాస్, మహిళలకు రూ. 2,500, ఆరు గ్యారంటీలు అని హామీ ఇచ్చారన్నారు. కనీసం ఈ బస్తీలో రోడ్లు, నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. స్థానికులు వెళ్లి అడిగితే మున్సిపల్ అధికారులు లీడర్లు చెప్పాలని అంటున్నారని చెప్పారు. మున్సిపల్ అధికారులు బస్తీ వాసులకు కనీస పనులు చేయకపోతే ఎలా అన్నారు. ప్రజలను మభ్య పెట్టడం మానేసి వారికి మంచి చేసే పని చేయాలన్నారు.గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు ఇవ్వడం లేదన్నారు.శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిస్థితిపై పటారం, లోన లోటారం అన్న చందంగా ఉందన్నారు.ఇక్కడి శ్మశానం నుంచి పాములు ఇళ్లల్లోని వస్తున్న పరిస్థితి ఉందన్నారు. చెత్త తీసుకెళ్లటానికి కూడా డబ్బులు అడుగుతున్నారని, సీఎం, ఎమ్మెల్యే, కార్పొరేటర్  ఇక్కడి సమస్యలను పట్టించుకోవాలన్నారు. ఈ బస్తీ వాసులకు జాగృతి అండగా ఉంటుందని, వారి సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారి కోసం పనిచేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *