వియత్నాంలో వరదల విధ్వంసం—16 మంది ప్రాణాలు కోల్పోయారు

సాక్షి డిజిటల్ న్యూస్ :వియత్నాం కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలం అయింది. భారీ వర్షాలకు వరదలు ముంచెత్తాయి. 1500 MMలకు పైగా వర్షం కురవడంతో సెంట్రల్ వియత్నాంలోని చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. వరదలతో కొండ చరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షం, వరదల ధాటికి 16 మంది చనిపోయారు. 43వేల నివాసాలు, 10వేల హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లినట్లు అక్కడివిపత్తు శాఖ తెలిపింది. చాలా ప్రాంతాలను వరద వీడకపోవడంతో ప్రజలు ఇళ్లపైకి చేరి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు వియత్నాం అంతటా అతలాకుతలం చేశాయి. 40 ఏళ్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. మధ్య వియత్నాంలో రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు వరదల సంభవించి కొంతమంది మృతి చెందగా.. ఐదుగురు గల్లంతయ్యారు. ముఖ్యంగా వియత్నాంలోని తీరప్రాంత ప్రావిన్సులను కుండపోత వర్షాలు ముంచెత్తాయి. ఇది 4 దశాబ్దాలలో అత్యంత భారీ వర్షపాతంగా చెబుతున్నారు నిపుణులు.భారీ వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయారు అక్కడి ప్రజలు. కొండప్రాంతాల్లో మట్టి చరియలు, తీరప్రాంతాల్లో వరదలు చోటుచేసుకున్నాయి. రహదారులు దెబ్బతినడంతో అనేక ప్రాంతాలు బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు సహాయక చర్యలకు కూడా ఆటంకం కలుగుతుంది. వరదలపై వియత్నాం ప్రభుత్వం అత్యవసర పరిస్థితి ప్రకటించింది. బలగాలను సహాయక చర్యలకు రంగంలోకి.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలకు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేశారు. ఆహారం, త్రాగునీరు, ఔషధాలు అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *