సాక్షి డిజిటల్ న్యూస్ :‘హనుమాన్’ బంపర్ సక్సెస్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే ఆ హైప్‌కు తగ్గట్టుగా ఆయన నుంచీ ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రోలౌట్ కాకపోవడం ఇండస్ట్రీలో పెద్ద డిస్కషన్ పాయింట్‌గా మారింది. పోస్టర్లు, అనౌన్స్‌మెంట్లతో భారీ లైనప్..ప్రశాంత్ వర్మ పేరుతో ఇంతకాలంగా వస్తున్నవి ఇవే. కానీ వర్క్‌స్టేషన్లలో మాత్రం ప్రాజెక్టులు ముందుకు కదలకపోవడం వల్ల పలువురు నిర్మాతలు, హీరోలు నిరాశ చెందారు.ఇది వరకే ప్రశాంత్ వర్మ రూపొందించబోతున్నట్లు ప్రకటించిన సినిమాటిక్ యూనివర్స్ కూడా మాటల్లోనే నిలిచిపోయింది. ప్రభాస్, మోక్షజ్ఞ, రణ్వీర్ సింగ్.. ఈ పేర్లన్నీ మీడియాలో చక్కర్లు కొట్టినప్పటికీ ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ కాలేదు. హనుమాన్ సీక్వెల్ జై మానుమాన్ చిత్రాన్ని రిషబ్ శెట్టితో ప్లాన్ చేసినా కూడా ఇదే పట్టికలో చేరింది. పోస్టర్ విడుదల అయి చాలా కాలమే అయినా తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ లేదు. తాజాగా జై హనుమాన్ ప్రాజెక్ట్ మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది. రిషబ్ శెట్టి వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు నెలల డేట్లు ఇచ్చాడని, జనవరి నుంచి మే వరకూ కంటిన్యూగా షూట్ చేయొచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ ఐదు నెలల తర్వాత డేట్లు ఇవ్వడం కష్టం అని రిషభ్ అటు క్లియర్‌గా చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు బాధ్యత మొత్తం ప్రశాంత్ వర్మ పైకి వెళ్లింది. ఈ డేట్లను వాడుకుని సినిమా ముందుకు తీసుకెళ్తాడా లేక మళ్లీ ఆలస్యం చేస్తాడా? అనేది చూడాలి. మరోవైపు ప్రశాంత్ వర్మపై ఉన్న వివాదాలు కూడా అలాగే కొనసాగుతున్నాయి. హనుమాన్ నిర్మాతలతో వివాదం ఫిల్మ్ ఛాంబర్ వరకు వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు జై హనుమాన్ నిజంగా ఫ్లోర్‌పైకి వెళ్లితే అయితే ప్రశాంత్ వర్మ కెరీర్‌కు ఊపొచ్చే అవకాశం ఉంది. లేదంటే ఆయన లైనప్ మరోసారి పేపర్ పైపైనే మిగిలిపోయే ప్రమాదం ఉంది. వచ్చే ఏడాది ఆయన నుంచి కనీసం ఒక్క సినిమా అయినా విడుదల అవుతుందా? అనే విషయాలను అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.