సాక్షి డిజిటల్ న్యూస్ :మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ముంబైలో ఎదురెదురుగా వస్తున్న వాహనాలపైకి వేగంగా వచ్చిన కారు దూసుకెళ్లింది. తానేలోని ఈస్ట్–వెస్ట్ ప్రాంతాలను కలిపే ఫ్లైఓవర్‌పై ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ముంబై సమీపంలోని అంబర్నాథ్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. థానేలోని తూర్పు – పశ్చిమాలను కలిపే ఈ రద్దీగా ఉండే వంతెన సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కారు చాలా వేగంగా కదులుతుండటంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఒకదాని తర్వాత ఒకటిగా అనేక వాహనాలను ఢీకొట్టింది. సంఘటన జరిగిన వెంటనే, కారు బ్రిడ్జిపై బోల్తా పడటంతో గందరగోళం నెలకొంది. ఈ సంఘటనలో అనేక వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలను ప్రారంభించారు.ప్రమాదానికి కారణమైన కారు స్థానిక స్థానిక శివసేన నాయకుడు ప్రమోద్ చౌబే పేరిట రిజిస్టర్ అయిందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో ఆయన కారులోనే ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డ వారిని స్థానికులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. మునిసిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన భార్యకి మద్దతుగా ప్రచారానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగనట్లు తెలుస్తోంది. అయితే కారు డ్రైవర్‌కు హార్ట్ అటాక్ రావడతో ప్రమాదం జరిగిందని కొందరు చెబితే.. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని మరి కొందరు చెబుతున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తు్న్నారు.