సాక్షి డిజిటల్ న్యూస్ :సంచలనం రేపిన ఐ బొమ్మ రవి పై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐ బొమ్మ రవి పై 10 సెక్షన్లను పోలీసులు నమోదు చేశారు. వీటిల్లో ఐటీ యాక్ట్ తో పాటు.. BNS సెక్షన్లు, సినిమాటోగ్రఫీ సెక్షన్లను కూడా పోలీసులు జోడించారు. U/Sec 66C, 66E of IT Act, BNS కింద నమోదైన సెక్షన్లు: Sec. 111(2)(b), 318(4) r/w 3(5), 351, 336(3), 338 and 340(2) సినిమాటోగ్రఫీ సెక్షన్లు – Sec 63, 65 of Copy Right Act, Sec 6AA, 6AB Cinematographic Amendment Act 2023 of Cyber Crime PS, Hyderabad. ఇలా మొత్తం 10 సెక్షన్లను ఐ-బొమ్మ రవి పైన పోలీసులు నమోదు చేశారు. అయితే వీటిలో BNS 111(2)(b) అనే సెక్షన్ చాలా కీలకము. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే ఐ బొమ్మ రవికి జీవితకాలం పాటు శిక్ష పడే ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే చెంచల్ గుడా జైల్లో ఉన్న రవి కొద్దిరోజుల తర్వాత బెయిల్ పై బయటికి రావచ్చు కానీ కేసుకు సంబంధించిన తుది విచారణ జరిగిన తర్వాత కచ్చితంగా అతడికి కఠిన శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బిఎన్ఎస్ 111(2)(బి) అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్ కు సంబంధించిన సెక్షన్. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటేంటే.. ఈ సెక్షన్ కింద జీవిత ఖైదు పడడమే కాదు.. పది లక్షల వరకు జరిమానా కూడా కట్టాల్సి వస్తుంది. మరో సెక్షన్ BNs318 (4) ను కూడా ఐ బొమ్మ రవి పై జోడించారు పోలీసులు. ఈ సెక్షన్ ప్రకారం ఇతరులకు సంబంధించిన వస్తువులు లేదా ప్రాపర్టీని దొంగలించినా.. అక్రమంగా దారుల్లో లాగేసుకుఏన్నా.. ఈ సెక్షన్ కింద బుక్ చేస్తారు. ఇక ఈ సెక్షన్ ప్రకారం కూడా.. ఐ బొమ్మ రవికి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇక కాపీరైట్ ఆక్ట్ సెక్షన్ 63, 65 కేసు నమోదు చేశారు. వీటి ప్రకారం ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల వరకు శిక్షపడే అవకాశం ఉంది. IT Act యాక్ట్ Sec 66C కింద.. ఇతర వ్యక్తి యొక్క ఎలక్ట్రానిక్ సంతకం, పాస్వర్డ్ లేదా గుర్తింపును దొంగలిస్తే… 3 సంవత్సరాల వరకు జైలు + ఒక లక్ష రూపాయల వరకు జరిమానా విదించే అవకాశం ఉంది. Sec 66E గోప్యతా ఉల్లంఘన – దీని ప్రకారం 3 సంవత్సరాల వరకు జైలు, లేదా 2 లక్షల వరకు జరిమానా పడే ఛాన్స్ ఉంది. Cinematograph Amendment Act, 2023 ప్రకారం.. Sec 6AA – Unauthorized recording చేసినందుకు గాను ఐ బొమ్మ రవికి 3 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష + 3 లక్షల జరిమానా పడే అవకాశం ఉంది. అంతేకాదు gross production cost కింద ఓ వీడియో వల్ల ప్రొడ్యూసర్ నష్టపోయిన దానిలో 5 శాతం వరకు జరిమానా విదించేలా చట్టంలో ఉంది. ఇక సినిమాటోగ్రఫీ Amendment Act లోని మరో సెక్షన్ 6AB Unauthorized public exhibition ప్రకారం.. 3 నెలల నుంచి 3 సంవత్సరాల జైలు శిక్ష + 3 లక్ష జరిమాన .. లేదా దాంతో పాటే 5% of audited gross production cost జరిమానా… కూడా పడే అవకాశం ఉంది.