Header Banner

భూకంపం బారిన బంగ్లాదేశ్… గాయాలతో విలవిలలాడుతున్న వందలాది మంది

సాక్షి డిజిటల్ న్యూస్ :బంగ్లాదేశ్‌లో నిన్న (శుక్రవారం) భారత కాలమానం ప్రకారం, ఉదయం 10:08 గంటలకు భారీ భూకంపం సంబంవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.2గా నమోదయ్యింది. రాజధాని ఢాకా సమీపంలో సంబవించిన భూ కంపంలో 10 మృతి చెందగా.. మరో 100 మంది పైగా గాయపడ్డారు. భూకంపం కారణంగా వివిధ ప్రాంతాల్లో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల మంటలు అంటుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.ఢాకా సమీపంలో సంబవించిన ఈ భూప్రకంపనల నేపథ్యంలో.. పశ్చిమ బెంగాల్‌లోని పలు ఈశాన్య ప్రాంతాల్లో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.  బంగ్లాదేశ్‌లోని నర్సింగ్ది ప్రాంతానికి 13 కి. మీ దూరంలో ఈ భూకంపం వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఇది భూమికి కేవలం 10 కి.మీ లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు తెలిపారు. మరోవైపు ఈ భూకంపం ప్రభావంతో కోల్‌కత్తా సహా అస్సాంలోని గువాహాటి ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.