Header Banner

బాంబు బెదిరింపు సమాచారం నేపథ్యంలో శంషాబాద్‌లో పోలీసులు హైఅలర్ట్

సాక్షి డిజిటల్ న్యూస్ :ఇటీవల దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులు సాధరణమైపోయింది. పాఠశాలలు, కోర్టులు, ఎయిర్‌పోర్టులకే కాదు పలువురు ప్రముఖుల ఇళ్లకు సైతం బాంబు బెదిరింపులు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ రోజు ఉదయం రాజధానిలోని శంషాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిర్ పోర్టులో బాంబు పెట్టామంటూ ఓ అగంతకుడు అధికారులకు మెయిల్ ద్వారా పంపాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ సిబ్బంది విమానాశ్రయంతో పాటు దాని చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల్లోనూ ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.ఇటీవల జరిగిన ఢిల్లీ ఎర్రకోట సమీపంలోని బాంబు పేలుడు నేపథ్యంలో.. క్షుణంగా అనుమానిత వస్తువులను పరిశీలస్తున్నారు. ఇందులో భాగంగా.. ప్రస్తుతం సందర్శకుల పాస్ కౌంటర్లను తాత్కాలికంగా మూసివేశారు. గతంలో పలువురు ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే.. దీంతో అప్రమత్తమైన సిబ్బంది డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. ఇప్పుడు మరోసారి బాంబు బెదిరింపులు రావడంతో.. ఆకతాయిల పనే అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.