అధర్మంపై ధర్మం గెలిచింది: మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

*బాధ్యతలు స్వీకరించిన ఫాక్స్ చైర్మన్ లకు సన్మానం*

సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 21, మల్లాపూర్ మండలం రిపోర్టర్ ఆకుతోట నర్సయ్య : అధర్మంపై ధర్మం గెలిచిందని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. శుక్రవారం మల్లాపూర్ మండల కేంద్రంలోని కేఎంఆర్ గార్డెన్లో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని అన్నారు. మండలానికి చెందిన చిట్టాపూర్, సిర్పూర్, మల్లాపూర్ ప్యాక్స్ చైర్మన్ లను కేవలం బిఆర్ఎస్ పార్టీ చెందిన వారని తొలగించారని అన్నారు. వారు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ సూచనల మేరకు కోర్టులో కేసు వేయడంతో కోర్టులో వారికి న్యాయం జరిగిందని అన్నారు. గత పది సంవత్సరాల పాలనలో ఎవరిపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని అన్నారు. పార్టీలకు అతీతంగా అందరికీ సమన్యాయం చేశామని తెలిపారు. అధర్మంపై ధర్మం ఎప్పటికైనా తప్పకుండా గెలుస్తుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. పార్టీ అభ్యర్థులను ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి కృషి చేయాలని కోరారు. అనంతరం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఫాక్స్ చైర్మన్లు వేంపేట నర్సారెడ్డి, అంజిరెడ్డి, నేరెళ్ల మోహన్ రెడ్డి లను ఆయన ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సంధి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తోట శ్రీనివాస్, దేవ మల్లయ్య, కాటిపల్లి ఆదిరెడ్డి, గౌరు నాగేష్, కదుర్క నర్సయ్య, ముద్దం శరత్ గౌడ్, బండి లింగస్వామి గౌడ్, దశ రెడ్డి, గోవింద నాయక్,చిట్యాల లక్ష్మణ్, పెద్దిరెడ్డి లక్ష్మణ్,బదినపల్లి ప్రేమ్, నల్ల రాజేశ్వర్,మేకల సతీష్, కొంపెల్లి రాజు,ఉయ్యాల లక్ష్మణ్,నల్ల లక్పతి,మాట్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *