సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 22, అడ్డ గూడూర్ రిపోర్టర్ నోముల ఉపేందర్ ) యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం చౌళ్ల రామారం గ్రామానికి చెందిన అనంతుల చంద్రశేఖర్ ను తెలంగాణ బిసి జేఏసీ వైస్ చైర్మన్ గా నియమిస్తున్నట్లు బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ నియామక పత్రాన్ని శనివారం అందజేశారు. ఈ సందర్భంగా బీసీ జెసి వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతుల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో బిసి జెఏసి వైస్ చైర్మన్ గా నియమించినందుకు బిసి జేఏసీ చైర్మన్కు, బీసీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. బీసీల అభివృద్ధికై తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ బీసీల బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.