మోదీ పర్యటనతో అయోధ్య సందడి –భక్తుల ఘన స్వాగతం

సాక్షి డిజిటల్ న్యూస్ :ప్రధాని నరేంద్ర మోదీ నేడు (నవంబర్‌ 25 మంగళవారం) అయోధ్య పర్యటనలో భాగంగా శ్రీ రామ్‌లల్లా ఆలయంలో పవిత్ర ధ్వజారోహణంలో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమానికి హాజరవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం పైభాగంలో కాషాయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో రామ మందిరాన్ని ప్రత్యేకంగా అలంకరించగా, అయోధ్య నగరం ఉత్సవ వాతావరణంతో కళకళలాడుతోంది.అయోధ్య రామమందిరంలో ధ్వజారోహణ కార్యక్రమానికి అంతా సిద్ధమైంది. బాలరాముడి ప్రాణప్రతిష్ట తర్వాత అంత ప్రతిష్టాత్మకమైన వేడుక ఇదే కావడంతో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం పైభాగంలో కాషాయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో రామ మందిరాన్ని ప్రత్యేకంగా అలంకరించగా, అయోధ్య నగరం ఉత్సవ వాతావరణంతో కళకళలాడుతోంది.అయోధ్య ధ్వజారోహణ వేడుకల్లోనే ఆలయ శిఖరంపై కాషాయ జెండాను ఎగురవేయనున్నారు ప్రధాని మోదీ. 161 అడుగుల ఆలయ శిఖరంపై 30 అడుగుల ఎత్తుండే.. జెండా స్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 11గంటల 58 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో ఈ కాషాయ జెండా ఎగురవేసే కార్యక్రమం జరగనుంది.ఉదయం 11 గంటలకు రామమందిర సముదాయానికి చేరుకుంటారు ప్రధాని మోదీ. ముందుగా అన్ని ఉప ఆలయాలను సందర్శించి స్థానిక సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. ఆయన ముందుగా సప్తఋషి మండపంలో వాల్మీకి మహర్షిని సందర్శించే అవకాశం ఉంది. ఆ తరువాత, ప్రధానమంత్రి అభిజిత్ ముహూర్తం సందర్భంగా రామమందిరం పైభాగంలో ప్రత్యేక హారతిలో పాల్గొని ధర్మధ్వజాన్ని (జెండా) ఎగురవేస్తారు. జెండా ఎగురవేయడానికి శుభ సమయం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య నిర్ణయించబడింది. జెండాను ఎగురవేసిన తర్వాత ప్రధానమంత్రి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.ధ్వజారోహణం, కాషాయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు RSS చీఫ్‌ మోహన్‌భగవత్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ హాజరుకానున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పాటు ఆలయ చుట్టుపక్కల ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ధ్వజారోహణ కార్యక్రమంతో అయోధ్య రామజన్మభూమి ఆలయ ప్రధాన నిర్మాణం పూర్తికానుంది.ప్రధాని పర్యటన నేపథ్యంలో అయోధ్యలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. అయోధ్య భద్రత కోసం 6,970 మంది సిబ్బందిని నియమించారు. NSG స్నిపర్లు, NSG కమాండోలు, సైబర్ నిపుణులు, సాంకేతిక బృందాలతో సహా 6,970 మంది భద్రతా సిబ్బందిని నియమించారు. జనసమూహ నిర్వహణ, భద్రతా తనిఖీలు, పేలుడు పదార్థాల గుర్తింపు, అత్యవసరాల కోసం ప్రత్యేక బృందాలను నియమించారు. ఆలయ సముదాయం, పరిసర ప్రాంతాలలో యాంటీ-డ్రోన్ వ్యవస్థలు చురుకుగా ఉన్నాయి.

వివాహ పంచమి రోజునే ధ్వజారోహణ వేడుక.. సీతాశ్రీరాముల వివాహ వార్షికోత్సవం రోజునే ధ్వజారోహణ కార్యక్రమం కలిసి వచ్చింది. ఈ ప్రత్యేక సందర్భంగా శ్రీరామ చంద్రుల వారికి ప్రత్యేక పట్టువస్త్రాలను తయారు చేశారు. సీతమ్మవారికి సైతం ప్రత్యేకంగా తయారు చేసిన పట్టు చీరను కర్ణాటక నుండి తెప్పించారు.

జెండా చిహ్నాల అర్థం ఏంటంటే.. కుంకుమ రంగు: జ్వాల, కాంతి, త్యాగం, తపస్సును సూచిస్తుంది.

ధ్వజస్తంభం: ఆలయం 161 అడుగుల ఎత్తైన శిఖరం పైన 30 అడుగుల ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. దీని కారణంగా జెండా మొత్తం 191 అడుగుల ఎత్తులో ఎగురుతుంది.

సూర్య దేవుడు: కాషాయ జెండాపై చిత్రీకరించబడిన సూర్యుడు శ్రీరాముని సూర్యవంశానికి చిహ్నం.

‘ఓం’: దేవుని పేరులోని మొదటి అక్షరం, చైతన్యాన్ని, శాశ్వత సత్యాన్ని సూచిస్తుంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *