సాక్షి డిజిటల్ న్యూస్ :బీసీ రిజర్వేషన్ తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ 46ను తక్షణమే రద్దు చేయాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లేని పక్షంలో బీసీల ఆగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం గురి కావాల్సి వస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెంబర్ 46ను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జీవో ప్రతులను దగ్ధం చేయాలని బీసీ జేఏసీ ఇచ్చింది. ఈ పిలుపుమేరకు ఆదివారం హైదరాబాదులోని అంబర్పేట ప్రాంతంలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహం ఎదుట బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జీఓ నెంబర్ 46 ప్రతులను చించి నిరసన వ్యక్తం చేశారు.కాంగ్రెస్, బీజేపీపి పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని, అందుకే జీఓ నంబర్ 46 తీసుకొచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధిక శాతం రెడ్లను సర్పంచులుగా చేయడానికి కోసం అగ్రకుల నాయకులు కుట్రలు కుతంత్రాలు చేస్తు బీసీలను రాజకీయంగా అణిచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో బిల్లులు పెట్టి చట్టం చేసే సందర్భంలో మద్దతిచ్చిన రెండు పార్టీలు ప్రస్తుతం మాట మార్చి బీసీలకు ద్రోహం చేసుందుకు పూనుకున్నారన్నారు. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులతోపాటు రాష్ట్ర సర్పంచులు సైతం అగ్రకులాలకే కట్ట పెట్టాలని కుట్ర తోనే 42శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలపలేదని ఆరోపించారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ 46 తో జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు కేవలం రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు 18 శాతం రిజర్వేషన్లు మాత్రమే వర్తిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలా బీసీ వ్యతిరేకతతో తెలంగాణలో బీసీలు రాజకీయ సమాధి జరుగుతుందని ఆవేదన చెందుతున్నారు. బీసీల కోసమే మేము ఉన్నానంటూ చెప్తూ వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాత్రికి రాత్రి జీవోను తెచ్చి బీసీల జీవితాలను చీకట్లోకి నెట్టివేసిందని ఆయన మండిపడ్డారు.బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వంపై పోరాడకుండా బీసీలకు సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోతుందని ఆయన ప్రశ్నించారు. జీఓ నంబర్ 9 ద్వారా బీసీలకు వేల గ్రామపంచాయతీలు రిజర్వేషన్ అయ్యాయని, బీసీ రిజర్వేషన్ కాబడిన గ్రామపంచాయతీల బీసీ నేతల సంతోషం జీఓనెంబర్ 46తో బీసీల రాజకీయ సమాధి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. జీఓ నంబర్ రద్దు చేసే వరకు బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ పద్ధతి కల్పించే వరకు పోరాటాన్ని ఆపేది లేదని హెచ్చరించారు.