సాక్షి డిజిటల్ న్యూస్ :ఉగ్రమూకలను పెంచి పోషిస్తోన్న పాకిస్థాన్ మరోసారి దుస్సాహసానికి పాల్పడింది. అఫ్గానిస్థాన్‌లోని ఖోస్ట్ ప్రావిన్స్‌పై ఎయిర్ స్ట్రైక్స్‌ను నిర్వహించింది. ఈ దాడుల్లో ఆఫ్గాన్ పౌరులు 10 మరణించగా.. నలుగురు గాయపడ్డారు.అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ దళాలు ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించి, పలు ప్రావిన్సీలపై బాంబులతో విరుచుకుపడింది. ముఖ్యంగా అఫ్గాన్‌లోని ఆగ్నేయ ఖోస్ట్ ప్రావిన్స్‌లోని ఓ ఇంటిపై పాక్ దళాలు దాడులకు పాల్పడింది. అర్ధరాత్రి సమయంలో ఈ దాడికి పాల్పడ్డారని తాలిబన్ పరిపాలనా ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. ఈ దాడిలో 10 మంది అఫ్గాన్ పౌరులు మరణించగా.. నలుగురు గాయపడ్డారని పేర్కొన్నారు.పాక్ దళాలు మెరుపు దాడిలో మృతిచెందిన వారిలో 9 మంది పిల్లలు ఉండగా.. ఒక మహిళ ఉన్నారని అఫ్గాన్ అధికారులు ధృవీకరించారు. ఈ దాడిపై స్పందించిన తాలిబన్ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. అఫ్గాన్‌దేశం పాక్‌ను లెక్కచేయడంలేదని, దీంతో పాటుగా భారత్‌కు దగ్గరవుతుంది. దీన్ని పొరుగా దేశం పాక్ జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే అర్ధరాత్రి పాక్ దొంగదెబ్బ తీసినట్లుగా తెలుస్తుంది. అయితే పాకిస్థాన్ ఎయిర్ స్ట్రైక్స్‌కు ప్రతీకారం తప్పదని తాలిబన్ ప్రభుత్వం గట్టిగా హెచ్చరించింది.