ఇందు చూడన్ కొత్త చిత్రంలో ద్రౌపది పాత్ర—ఫస్ట్ లుక్‌పై మంచి స్పందనలు

సాక్షి డిజిటల్ న్యూస్ :రిచర్డ్ రిషి హీరోగా సోల చక్రవర్తి నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ద్రౌపది 2’ ప్రస్తుతం వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని మోహన్ జి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. తాజాగా చిత్రబృందం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ద్రౌపది దేవి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. హీరోయిన్ రక్షణ ఇందుచూడన్ పోషిస్తున్న ద్రౌపది దేవి పాత్ర ఈ పోస్టర్‌లో అత్యంత గాంభీర్యంగా, శోభాయమానంగా కనిపిస్తోంది. ఆమె వేషధారణ, ఆభరణాలు, మొత్తం మేకోవర్ అన్నీ కలిసి పాత్రకు ప్రత్యేకమైన ఘనతను తెచ్చాయి. పోస్టర్ బ్యాక్‌డ్రాప్‌లో కనిపించే సెట్‌ వర్క్‌ ఈ చిత్రానికి పెట్టిన భారీ స్కేల్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది. ఎక్కడా తగ్గకుండా పూర్తిస్థాయి ప్రొడక్షన్ వేల్యూ‌తో సినిమా రూపొందుతుందనే అంచనా మరింతగా పెరిగింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ క్లైమాక్స్ దశలో కొనసాగుతుండగా త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి ఫిలిప్ ఆర్. సుందర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా..దేవరాజ్ ఎస్ ఎడిటర్‌గా..ఎస్.కే ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. భారీ స్థాయి పోరాట సన్నివేశాలను యాక్షన్ సంతోష్ తెరకెక్కిస్తున్నారు. చిత్రానికి సంగీతం జిబ్రాన్ సమకూరుస్తున్నారు. ‘ద్రౌపది 2’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. ద్రౌపదికి ఇది కొనసాగింపుగా రూపొందుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *