SEC సాయంత్రం ప్రత్యేక సమావేశం, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల

సాక్షి డిజిటల్ న్యూస్ :తెలంగాణను సమగ్రంగా, ప్రతి వర్గానికీ సమాన అవకాశాలు నమోదయ్యే రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047’ను రూపుదిద్దుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం నుంచి ఈ నెల 30 వరకు అన్నీ శాఖల వారీగా సమీక్షలు చేపట్టనున్నారు. గత రెండు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన పురోగతి, మరికొన్ని దశాబ్దాలలో చేరుకోవలసిన లక్ష్యాలు, వాటి కోసం రూపొందించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశాల్లో స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, భద్రత, పర్యావరణ పరిరక్షణ వంటి పునాది రంగాల్లో సమగ్ర మార్పులకే ఈ విజన్ కీలక ఆధారం కానుంది. యువతకు ఆధునిక నైపుణ్యాల్ని అందించడానికి ఐటీ, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఆంత్రప్రెన్యూర్‌షిప్ రంగాల్లో ప్రపంచ స్థాయి శిక్షణను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణను గ్లోబల్ స్కిల్ కేపిటల్‌గా తీర్చిదిద్దడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంది.ఈ నెల 8, 9 తేదీల్లో టెలంగానా ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’లో ఈ విజన్ డాక్యుమెంట్ ని ప్రధాన అంశాలు చర్చకు రానున్నాయి. తొలి రోజున విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళాభివృద్ధి, యువత నైపుణ్యాలు, ఉద్యోగావకాశాలు, సంక్షేమ పథకాల అమలు వంటి సామాజిక రంగాలతో సంబంధిత సెషన్లు నిర్వహించనున్నారు. రెండోరోజున పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, మౌలిక వసతులు, పెట్టుబడిల ఆకర్షణ, సృజనాత్మక పరిశోధనలు, పరిశ్రమీకరణ వేగం వంటి అంశాలపై అంతర్జాతీయ నిపుణులు చర్చించనున్నారు.సమిట్‌లో ప్రపంచ దేశాల రాయబారులు, ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులు, పరిశోధకులు, జాతీయ–అంతర్జాతీయ సంస్థల నాయకులు లు పాల్గొనే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తుంది . అదే రోజు ‘తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047’ను సీఎం విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక డ్రోన్ షోను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

మూడు కోర్ జోన్ల అభివృద్ధి నమూనా రాష్ట్ర అభివృద్ధిని వికేంద్రీకరించే దిశగా మూడు కోర్ జోన్ల కాన్సెప్ట్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది.

అర్బన్ కోర్ (హైదరాబాద్): డీప్‌టెక్, ఏఐ, ఇండస్ట్రీ 4.0, ఇంజినీరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, జీసీసీలు, స్టార్టప్ ఎకోసిస్టమ్, గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ లను పెంపొందించే కేంద్రంగా నగరం అభివృద్ధి చెందనుంది.

సెమీ-అర్బన్ జోన్లు (జిల్లా కేంద్రాలు): ఎకో-ఇండస్ట్రియల్ పార్కులు, పర్యావరణ ప్రమాణాలకు అనుగుణమైన పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పడనున్నాయి.

రూరల్ తెలంగాణ: టెక్నాలజీ ఆధారిత వ్యవసాయం, పశుసంవర్ధక, చేపల పెంపకం, అడవి వనరుల ఆధారిత జీవనోపాధులను బలోపేతం చేయడం, హ్యాండ్లూమ్–హ్యాండీక్రాఫ్ట్ రంగాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించనున్నారు. గ్రామీణ పర్యాటకాన్ని కూడా విస్తృతంగా అభివృద్ధి చేయాలనే యోచన ఉంది.

సస్టైనబుల్ పాలసీలు, పెట్టుబడి ఆకర్షణ లక్ష్యం పెట్టుబడులను మరింతగా ఆహ్వానించేందుకు లో-కార్బన్ మార్గదర్శకాలు, గ్రీన్ ఇండస్ట్రియల్ ప్రోత్సాహాలు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు వంటి అంశాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వ్యవసాయ రంగంలో మార్కెట్ యాక్సెస్ విస్తరణ, పంట వైవిధ్యీకరణ, అగ్రిటెక్ వినియోగం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యం.

2047 లక్ష్యం- ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన జీవితం విద్య, పోషణ, ఆరోగ్యం, సంక్షేమ రంగాల్లో వ్యవస్థల సమన్వయం ద్వారా ప్రతి పౌరుడు ఆరోగ్యవంతమైన, గౌరవప్రదమైన, భద్రతతో కూడిన జీవితం గడపాలనే దీర్ఘకాల దృష్టితో ఈ దార్శనిక పత్రం సిద్ధమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *