సాక్షి డిజిటల్ న్యూస్ : నిజ ఘటనల ఆధారంగా రూపొందిన ఎమోషనల్ లవ్ డ్రామా ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ శుక్రవారం (నవంబర్ 21) విడుదలైన సంగతి తెలిసిందే. అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని దక్కించుకుంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ ఈ సినిమాకు ప్రశంసలు అందిస్తున్నారు. కలెక్షన్స్ విషయానికి వచ్చేసరికి మంచి ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. మేకర్స్ లెక్కల ప్రకారం ఈ సినిమాకు నాలుగు రోజులకుగానూ రూ. 9.08 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుండటంతో రోజు రోజుకూ వసూళ్లు పెరుగుతున్నాయి. నాలుగో రోజు కలెక్షన్స్‌ను చూస్తే తొలి మూడు రోజులకు మించి ఉంది. వీక్ డేస్ లోనూ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి పాజిటివ్ టాక్‌తో రన్ అవుతుండటం విశేషం. ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చారు. వరంగల్, ఖమ్మం మధ్య ఉండే పల్లెటూర్లో పల్లెటూర్లో ఉండే రాజు బ్యాండ్ కొట్టటంలో స్పెషలిస్ట్. అదే గ్రామానికి చెందిన రాంబాయి అతన్ని ప్రేమిస్తుంది. అయితే రాంబాయి తండ్రికి వారి ప్రేమ ఇష్టం ఉండదు. కానీ కూతురు తన మాట వినదు. దీంతో కాంపౌండర్‌గా పనిచేసే అతను ఓ ఘోరమైన పనికి పూనుకుంటాడు. దాని వల్ల అతని కూతురు జీవితం, అతన్ని ప్రేమించిన రాజు జీవితాలు ఎలా మారిపోతాయి. వారేమవుతారనేదే కథ.