సాక్షి డిజిటల్ న్యూస్ :బర్త్‌డే బమ్స్ పేరుతో కొందరు యువకులు చేసిన పని అతని స్నేహితుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఒక యువకుడు పుట్టినరోజు నాడు కేక్ కట్‌చేసేందుకు పిలిచి అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు తోటి స్నేహితులు. దీంతో అక్కడ నుంచి పారిపోయిన బాధితుడు సమీపంలో నిలబడి ఉన్న ఒక సెక్యూరిటీ గార్డ్ చేతిలోఉన్న వాటర్ బాటిల్‌తో మంటలార్పుకున్నాడు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పుట్టిన రోజు సెలబ్రేషన్స్ పేరుతో కొందరు యువకులు తన స్నేహితుడికి నిప్పంటించిన ఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. అబుల్ ముఖ్యం అనే ఓ యువకుడు ముంబైలోని గురునానక్ ఖల్సా కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్‌లో రెండవ సంవత్సరం చదువుతున్నాడు. అయితే నవంబర్ 24న, అతని పుట్టినరోజు సందర్భంగా. రాత్రి 8 గంటల ప్రాంతంలో, అతని స్నేహితుల్లో ఒకరైన అయాజ్ మాలిక్.. తన కోసం కేక్ కటింగ్ ప్లాన్ చేశామని తాను రావాలని పిలిచాడు.కాసేపటి తర్వాత మరొక స్నేహితుడు షరీఫ్ ఫోన్ చేసి అబుల్‌ను కోహినూర్ ఫేజ్ 3 సొసైటీలోని వింగ్ నంబర్ 26కి రమ్మని చెప్పాడు. దీంతో అబుల్ అక్కడికి వెళ్లాడు. అక్కడ అతని ఐదుగురు స్నేహితులు అయాజ్ మాలిక్, అష్రఫ్ మాలిక్, ఖాసిం చౌదరి, హజుపైనా ఖాన్ షరీఫ్ షేక్, అందరూ కలిసి అబుల్‌ను కేక్ తో స్వాగతించారు. ఇక అబుల్ కేక్ కట్‌చేసేందుకు కత్తి తీసిన వెంటనే వారందరూ అతనిపై రాళ్లు విసరడం స్టార్ట్ చేశారు. ఇంతలో, అయాజ్ పెట్రోల్ బాటిల్ తెచ్చి అష్రఫ్ సహాయంతో అబుల్ పై పోయడం ప్రారంభించాడు. అబుల్ పెట్రోల్ వాసన చూసి అరుస్తూ “ఏం చేస్తున్నావు?” అని ప్రశ్నించాడు. దీంతో మరో ముగ్గురు స్నేహితులు అబుల్ ని గట్టిగా పట్టుకున్నారు.. ఇక వారి నుంచి తప్పించుకునేందుకు అబుల్ ప్రయత్నించగా, అయాజ్ మాలిక్ తన దగ్గర ఉన్న లైటర్‌తో అబుల్‌కు నిప్పంటించాడు. దీంతో అబుల్ బట్టలకు మొత్తం నిప్పంటుకుంది. ఏం చేయాలో అర్థం కాక అబుల్ తన ప్రాణాల కాపాడుకునేందుకు అక్కడి నుంచి పరిగెత్తాడు. ఆ పక్కనే ఉన్న ఒక సెక్యూరిటీ గార్డు నుండి వాటర్ బాటిల్ తీసుకొని తనపై పోసుకున్నాడు, అయినా కూడా అతని మంటల ఆరిపోలేదు. దీంతో సమీపంలోని కుళాయి వద్దకు వెళ్లి పర్తిగా మంటలు ఆర్పుకున్నాడు.తర్వాత స్నేహితుల్లో ఒకరైన హుజైఫా వెంటనే అక్కడికి చేరుకొని అబుల్‌ను చికిత్స కోసం నగర ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ అబుల్‌ను పరీక్షించిన వైద్యులు అతనికి చికిత్స అందించారు. అబుల్ ముఖం, చెవులు, జుట్టు, ఛాతీ, రెండు చేతులు, కుడి చేతిపై తీవ్రంగా గాయలైనట్టు గుర్తించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై అత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.