Header Banner

‘తాలూకా’ టాక్ ఔట్—హిట్ ఆర్ ఫ్లాప్?

సాక్షి డిజిటల్ న్యూస్ : రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సె హీరో హీరోయిన్లుగా మహేష్ బాబు.పి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం (నవంబర్ 27)న రిలీజైంది. సాధారణంగా హీరో, హీరోయిన్లు, రాజకీయ నాయకులపై ఇప్పటి వరకు బయోపిక్స్ వచ్చాయి. కానీ తొలిసారి ఓ అభిమాని బయోపిక్‌ను సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించారు మేకర్స్. హీరో కోసం అభిమాని ఏం చేశాడు..అభిమాని కోసం హీరో ఏం చేశాడనేదే సినిమా కథ. రాత్రి యు.ఎస్ లో ప్రీమియర్స్ పడ్డాయి. సినిమాపై నెటిజన్స్ తమదైన రీతిలో స్పందిస్తున్నారు.చాలా మంచి సినిమా. రామ్ పెర్ఫామెన్స్ నెక్ట్స్ లెవల్ లో ఉంది. సూపర్‌స్టార్ పాత్రలో ఉపేంద్ర సూపర్ సెలక్షన్. మ్యూజిక్ చాలా బావుంది. ఫ్యాన్ బాయ్ ఫిల్మ్స్ మూవీస్ లో ఇదొక డిఫరెంట్ అటెంప్ట్.మాస్ ఊబి నుంచి బయటకు వచ్చి రామ్ చేసిన కొత్త ప్రయత్నం. సినిమాను థియేటర్స్‌లో చూసి ముందు ఎంజాయ్ చేయండి. రామ్ ఫ్యాన్స్ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మూవీ లవర్స్‌కు సినిమా తప్పకుండా నచ్చుతుంది. అని మరో నెటిజన్ సోషల్ మీడియాలో తన ఒపినియన్ చెప్పాడు.