Header Banner

ప్రజల హృదయాల్లో చోటు చేసుకున్న కలెక్టర్—గ్రామానికి ఆయన పేరే పెట్టుకుని ప్రేమను చూపిన స్థానికులు

సాక్షి డిజిటల్ న్యూస్ :71 ఏళ్ల క్రితం అప్పటి చిత్తూరు జిల్లాలోని గ్రామానికి చెందిన 46 కుటుంబాలు పింఛ జలాశయం నిర్మాణం వల్ల నిరాశ్రయులయ్యాయి. అప్పటి చిత్తూరు జిల్లా కలెక్టర్ గోపాలకృష్ణన్ వారికి ఇళ్లు, పొలాలు ఇప్పించి ఆదుకున్నారు. ఆయన చేసిన సేవలకు కృతజ్ఞతగా, ఆ గ్రామస్థులు తమ ఊరికి 'గోపాలకృష్ణాపురం' అని పేరు పెట్టుకున్నారు. ఇలా ఆ ఊరి జనాలు తమకు సాయం చేసిన అధికారిని గౌరవించుకుంటున్నారు.జిల్లాలకు ఐఏఎస్ అధికారులు కలెక్టర్లుగా బదిలీపై వస్తుంటారు.. వెళుతుంటారు. కానీ కొంతమంది కలెక్టర్లు మాత్రం వారి పని తీరుతో జిల్లాలో ప్రజలంతా వాళ్ల పేరును గుర్తుండిపోయేలా, చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకుంటారు. గతంలో పనిచేసిన కలెక్టర్లు చేసిన మంచి పనుల్ని ఇప్పటికీ తలచుకుంటారు.. వాళ్లు చేసిన మేలును అస్సలు మర్చిపోరు. ఏపీలో కూడా ఓ జిల్లా కలెక్టర్ 71 ఏళ్ల క్రితం చేసిన మంచిని ఆ గ్రామానికి చెందిన ప్రజలు ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నారు. ఏకంగా వారి ఊరికి కలెక్టర్ పేరు పెట్టుకున్నారు. కడప జిల్లాలోని ఆ ఊరి ప్రజలు ఇప్పటికీ ఆయన్ను తలచుకుంటారు.చిత్తూరు జిల్లా వాయల్పాడు తాలూకా గొంది పల్లె అనే ఊరు.. 1954లో పింఛ జలాశయం కట్టడంతో మునిగిపోయింది. పింఛ జలాశయం నిర్మాణం వల్ల ఆ గ్రామం మునిగిపోవడంతో 46 కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. వారంతా ఆ ఊరు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పాపం వారంతా ఎటు వెళ్లాలో కూడా దిక్కుతోచని పరిస్థితి ఉంది. ఆ సమయంలో వారందరికి ఆ దగ్గరలోనే ఉన్న ఉమ్మడి కడప జిల్లా సుండుపల్లి మండలం ముడుంపాడు గ్రామం దగ్గర ఇళ్లు, పొలాలు ఇచ్చారు. ఈ పునరావాస ప్రక్రియలో అప్పటి చిత్తూరు జిల్లా కలెక్టర్ గోపాలకృష్ణన్ కీలక పాత్ర పోషించారు. వారందరికి ఇళ్లు, భూములు వచ్చేలా కృషి చేశారు. ఆయన చేసిన సహాయానికి గుర్తుగా, ఆయన సేవలకు కృతజ్ఞతగా, ఆ గ్రామస్థులు తమ ఊరికి ఆయన పేరు పెట్టారు.ఇలా ఆ ఊరి ప్రజలు తమకు సహాయం చేసిన అధికారిని గౌరవించుకుంటున్నారు. ఆ ఊరి వాళ్ళు తమ గ్రామానికి "గోపాలకృష్ణాపురం" అని పేరు పెట్టుకున్నారు. ఆ అధికారి పేరును ఎప్పుడూ గుర్తుంచుకోవాలని ఇలా చేశారు. సాధారణంగా ఏదైనా ఊరికి, కాలనీకి, రోడ్డుకు రాజకీయ నేతల పేర్లు పెట్టుకోవడం ఇప్పటి వరకు చూశాము. వీళ్లు మాత్రం తమకు గూడు, బతకడానికి భూమిని ఇచ్చిన కలెక్టర్‌ పేరు పెట్టుకున్నారు. అందుకే ఆ ఊరి ప్రజలు గోపాలకృష్ణన్‌ను తలచుకుంటారు.