Header Banner

ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ఊరట—సంకేతాల ప్రకారం కీలక నిర్ణయం

సాక్షి డిజిటల్ న్యూస్ :ఏపీ ఫైబర్‌నెట్ కేసులో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుతో సహా మరో 15 మందికి ఊరట లభించింది. ఫైబర్‌నెట్‌లో ఎలాంటి అక్రమాలు జరగలేదని సీఐడీ స్పష్టం చేసింది. ఈ కేసులో సంస్థకు ఎటువంటి ఆర్థిక నష్టం వాటిల్లలేదని తేలడంతో.. అధికారికంగా కేసును మూసివేశారు. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టుకు సీఐడీ అధికారులు నివేదిక అందజేశారు. విచారణ సమయంలో ఈ కేసు సంబంధించిన ఫైబర్‌నెట్‌ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ మధుసూధనరెడ్డి, అలాగే ప్రస్తుతం ఎండీ గీతాంజలి శర్మ ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు సమర్పించిన తుది నివేదికతో తాము కూడా ఏకీభవిస్తున్నామని తెలిపారు. కేసు మూసివేతకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని లిఖితపూర్వకంగా కోర్టుకు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయంలో రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా.. ఈ కేసును నమోదు చేశారని ఆరోపణలు నెలకొన్నాయి. టెర్రాసాఫ్ట్ అనే సంస్థకు రూ. 321 కోట్ల వరకు ఆయాచితంగా లబ్ధీచేకూర్చారని, 2021 సెప్టెంబర్‌ నెలలో అప్పటి ఫైబర్‌నెట్‌ మేనేజింగ్ డైరెక్టర్ మధుసూధన రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. అనంతరం రెండేళ్లకు అంటే 2023 అక్టోబర్‌లో ఈ కేసులో చంద్రబాబు పేరును కూడా నిందితుడిగా చేర్చాడం జరిగింది.