ఫుట్‌బాల్ ఆడుతుండగా విద్యార్థి కుప్పకూలాడు

సాక్షి డిజిటల్ న్యూస్ :పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆటల సమయంలో విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడుతూ.. 10వ తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఆటలో తీవ్రంగా గాయపడ్డ అతన్ని వెంటనే ఇంటికి తీసుకెళ్లారు. కొద్దిసేపటికే అస్వస్థతకు గురైన విద్యార్థిని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.పెద్దపల్లి పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఫుట్‌బాల్ ఆడుతూ.. లక్ష్మీనగర్‌కు చెందిన పదవ తరగతి విద్యార్థిప్రతీక్ మృతి చెందారు. కుటుంబ సభ్యులు..కన్నీరు..మున్నీరుగా విలపిస్తున్నారు. పెద్దపల్లి పట్టణంలో సెంట్‌ఆన్స్ స్కూల్‌లో కలవేన ప్రతీక్ (15 ) పదవ తరగతి చదువుతున్నాడు. డ్రిల్ పీరియడ్‌లో స్కూల్ గ్రౌండ్ ఆవరణలో తోటి విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడుతూ.. ప్రతీక్ విద్యార్థి కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం అయింది. విషయాన్ని తోటి విద్యార్థులు ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లారు. స్కూల్ ప్రిన్సిపల్ తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పేరెంట్స్ హుటాహుటినా స్కూలు వద్దకు చేరుకున్నారు. గాయపడ్డ కుమారుడిని ఇంటికి తీసుకువెళ్లారు. అదేరోజు మధ్యాహ్నం ఆ విద్యార్థికి వాంతులు కావడంతో కరీంనగర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయం కావడంతో.. మెదడులో రక్తం గడ్డ కట్టిందని వైద్యులు నిర్ధారించారు. అయితే ప్రతీక్ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ప్రతీక్ పేరెంట్స్, తోటి విద్యార్థులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *